ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహాల ప్రత్యేకతలివే.. ఈ విగ్రహాలుఎక్కడున్నాయంటే?

Reddy P Rajasekhar
మనలో చాలామంది ఎంతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారనే సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉందనే ప్రశ్నకు మాత్రం చాలామందికి సమాధానం తెలియదు. మనలో చాలామంది ఏ పూజ చేసినా వినాయకుడికే తొలి పూజ చేస్తారు. వినాయకుడు ఆది దేవుడు కాగా వినాయకుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరతాయని చాలామంది నమ్ముతారు.
 
ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం మన దేశంలోనే ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే వినాయకుడి విగ్రహం ఉన్న ప్రదేశం మాత్రం థాయిలాండ్ లోని చాచోఎంగ్సావో ప్రావిన్స్ ప్రాంతం కావడం గమనార్హం. ఈ ప్రాంతంలో మొత్తం రెండు విగ్రహాలు ఉండగా ఈ రెండు విగ్రహాలు ప్రపంచంలోనే పెద్దవైన విగ్రహాలు. ఈ ప్రాంతంలో నివశించే బౌద్దులు సైతం వినాయకచవితి పండుగను జరుపుకుంటారు.
 
ఈ విగ్రహాలలో ఒక విగ్రహం ఎత్తు 49 మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పు కాగా మరొక విగ్రహం ఎత్తు 98 అడుగులు కావడం గమనార్హం. నవరాత్రుల సమయంలో సైతం వినాయకుడిని దర్శించుకోవడానికి ఇక్కడ చాలామంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. మరోవైపు ఈరోజు వినాయక చవితి పండుగ కాగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే మనపై వినాయకుని అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు.
 
పండితులు చెప్పిన సమయంలో వినాయకుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే వినాయకుడు సర్వ శుభాలను ప్రసాదిస్తాడు. వేకువజామునే తలస్నానం చేసి వినాయకుడిని పూజిస్తే మంచిది. శ్లోకాలను చదువుతూ వినాయకుడిని పూజించడం ద్వారా దైవానుగ్రహం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వినాయక స్వామిని పూజించే భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. కోరిన కోరికలను తీర్చే దేవుడు వినాయకుడు అని చాలామంది భక్తులు భావిస్తారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా వినాయకుడిని పూజిస్తే కెరీర్ పరంగా కూడా అంతకంతకూ ఎదిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: