తుంగభద్రా నది పోటెత్తితే కర్నూలు వాసులకు కష్టాలే.. ఆ రక్షణ గోడను నిర్మిస్తారా?

Reddy P Rajasekhar
రాయలసీమ జిల్లాలలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో కర్నూలు ఒకటి కాగా కొన్నిసార్లు మాత్రం భారీ వర్షాల వల్ల కర్నూలు వాసులు ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కర్నూలు నగరానికి సమీపంలో ఉన్న సంకల్ప్ బాగ్ కాలనీ, రాఘవేంద్ర మఠం, రాంబొట్ల గుడి, చిత్తారి వీధి, బండమెట్ట, జమ్మిచెట్టు ప్రాంతాలను ఆనుకుని తుంగభద్రా నది ప్రవహించడం జరిగింది. తుంగభద్రా నది పొంగితే ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది.
 
హంద్రీ నది, వక్కెర వాగు ప్రవాహాలు తుంగభద్రలో కలిసి వరద ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వరద ముప్పు నుంచి కర్నూలును కాపాడటానికి 2008 సంవత్సరంలో అప్పటి సీఎం వైఎస్సార్ స్వయంగా రక్షణ గోడకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మాత్రం ఇందుకు సంబంధించిన పనులు ముందుకు సాగలేదనే సంగతి తెలిసిందే. 2009లో కర్నూలు మునకను ప్రజలు సులువుగా మరిచిపోలేరు.
 
ఆ సమయంలో జన జీవనం స్తంభించిపోవడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వరద వస్తే కర్నూలు నగరానికి మునక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రక్షణ గోడలను నిర్మించాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు. 2009 వరదల సమయంలో కర్నూలు జిల్లాలోని 34 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
 
2009 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన కర్నూలు నగరాన్ని వరద నీరు చుట్టుముట్టింది. కర్నూలును వరదనీటి నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించాలని ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనలు సైతం ముందుకు సాగడం లేదు. రక్షణ గోడను నిర్మిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కర్నూలు వాసులకు మేలు జరిగేలా ఏపీ సీఎం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవ చూపితే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: