కూటమి కుంపట్లు... సర్కార్‌పై జనసేన ఎమెల్యే తిరుగుబాటు.. !
పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ సర్కిల్‌కు తాను సూచించిన రమేష్ నాయుడు అనే సిఐని కాకుండా.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మల్లికార్జున్ అనే సిఐని నియమించారు. రమేష్ నాయుడు పంచకర్ల సామాజిక వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మల్లికార్జున్ మరో సామాజికవర్గం కావడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు. తాను చెప్పిన తన సామాజిక వర్గానికి చెందిన రమేష్ నాయుడుకు సిఐ పోస్టు ఇవ్వకపోవడంతో.. పంచకర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన నియోజకవర్గం లోని మరో పోలీస్ సర్కిల్ అయిన పెందుర్తి సీఐ విషయం లోనూ పంచకర్ల మాట చెల్లుబాటు కాలేదట. ఇక్కడ కూడా తెలుగుదేశం వాళ్లు తమకు అనుకూలంగా ఉన్న సీఐను వేయించుకున్నారు.
తన నియోజకవర్గం లో తన మాట చెల్లుబాటు కాకపోతే ఎందుకంటూ ఈ క్రమంలోనే తన గన్ మ్యాన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ విధంగా రమేష్ బాబు ప్రభుత్వం పై తన అసంతృప్తిని.. అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు సహజంగానే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సులను పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చేసిన సిఫార్సులను ఓకే చేయడంతో.. ఇటు రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయటం.. ఇవన్నీ హైలెట్ అవుతున్నాయి. మరి దీనిని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.