విమర్శలు కాదు భరోసా ముఖ్యం.. బాబు, జగన్ లకు ఈ విషయం అర్థమవుతోందా?

Reddy P Rajasekhar
భారీ వరదల వల్ల విజయవాడ మునిగిపోవడం విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటుకున్నారు. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని జగన్ చెబుతుండగా విజయవాడ మునిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని ఆయన వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఇంత ఘోర విపత్తును చూడలేదని జగన్ పేర్కొన్నారు. కనీసం మంచి నీరు కూడా సరఫరా చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని పునరావాస శిబిరాలను సైతం ఏర్పాటు చేయలేదని జగన్ కామెంట్లు చేశారు. వరద బాధితులకు కనీసం ఆహారం అందడం లేదని వారిని తరలించడానికి తగిన సంఖ్యలో బోట్లు సైతం సమకూర్చలేదని జగన్ చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపానలపై చంద్రబాబు దృష్టి పెడితే బాగుంటుందని జగన్ కామెంట్లు చేశారు.
 
అయితే జగన్ చేసిన విమర్శలపై చంద్రబాబు కౌంటర్లు ఇచ్చారు. విపత్తుల సమయంలో ఎలా పని చేయాలో మాకు చెబుతావా జగన్ అని చంద్రబాబు తెలిపారు. నాడు రెడ్ కార్పెట్ వేసుకొని తిరిగావని నేడు తప్పక బురదలో దిగుతున్నావంటూ బాబు వెల్లడించారు. నువ్వు ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదని అమరావతిపై పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని చూడలేదని బాబు పేర్కొన్నారు.
 
అయితే ప్రజల్లో చాలామంది సరైన సమయానికి ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ బోట్లు, ట్రాక్టర్లు ప్రజల నుంచి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విమర్శల కంటే పార్టీల నేతలు ప్రజలకు భరోసా ఇవ్వడం ముఖ్యం కాగా ఇరు పార్టీల నేతలు తప్పు మీద తప్పు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నేతల తీరు మారకపోతే నేతలపై విమర్శలు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాబు, జగన్ ఈ విషయాలను ఇప్పటికైనా అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: