కృష్ణలంక రీటైనింగ్ వాల్ క్రెడిట్ జగన్ దా? బాబుదా? ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే?

Reddy P Rajasekhar
గత మూడు రోజులుగా ఏపీ ప్రజలను వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. తుపాను వల్ల తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. మరోవైపు ఎప్పుడూ చూడని విధంగా విజయవాడ వాసులు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నరకం చూశారు. మెజార్టీ ప్రాంతాల ప్రజలు వర్షం వల్ల అల్లాడుతున్న సంగతి తెలిసిందే.
 
విజయవాడ నగరంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు కృష్ణలంక రీటైనింగ్ వాల్ క్రెడిట్ చంద్రబాబుదని కొంతమంది చెబుతుంటే జగన్ దని మరి కొందరు చెబుతున్నారు. అయితే ఇద్దరిలో ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్నకు మాత్రం ఇద్దరి పేర్లు జవాబుగా చెప్పాల్సి ఉంటుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికే కృష్ణలంక రీటైనింగ్ వాల్ పనులు మొదలయ్యాయి.
 
ఈ రీటైనింగ్ వాల్ కోసం అప్పటి బాబు సర్కార్ 140 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా జగన్ సర్కార్ 350 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి పనులను పూర్తి చేసింది. అందువల్ల రీటైనింగ్ వాల్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్నకు ఇద్దరి పేర్లు జవాబుగా వినిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనే దాని గురించి ఆలోచించడానికి బదులుగా ప్రజలకు తమ వంతు సహాయం చేస్తే మంచిది.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల నేపథ్యంలో పిల్లలను స్కూల్స్ కు పంపే వాళ్లు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక రీటైనింగ్ వాల్ క్రెడిట్ కోసం పాకులాడితే ఇరు పార్టీలకు తీవ్రస్థాయిలో నష్టమని చెప్పవచ్చు. జలమయమైన ప్రాంతాలలో ట్రావెల్ చేసే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీకి మరో తుపాను ముప్పు ఉందని తెలుస్తోంది. చంద్రబాబు సేవా కార్యక్రమాలను మాత్రం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: