తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన ఎన్నో విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇక 2014 సంవత్సరం పార్టీని స్థాపించిన ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ పార్టీ పాల్గొనలేదు. ఇక 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలలో ఈ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపాడు.
కానీ ఈ ఎన్నికలలో జనసేన పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ పార్టీ నుండి పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి గెలిచాడు. పార్లమెంట్ అభ్యర్థులలో ఒక్కరు కూడా గెలవలేదు. పవన్ రెండు స్థానాల నుండి పోటీ చేస్తే రెండింటిలో కూడా ఓడిపోయాడు. దానితో ఎంతో మంది పవన్ పని అయిపోయింది. ఆయన పార్టీని క్లోజ్ చేస్తే బెస్ట్. ఆయన ఏమి సాధించలేడు అని అనేక మంది ఆయనపై మాటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఆ ఓటమిని చూసి వెనక్కి అడుగు వేయలేదు. ఓటమి తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ఆయన ముందుకు దూకాడు. 2019 నుండి 2024 ఎలక్షన్ల వరకు ఆయన తన పోరాటాన్ని చూపిస్తూనే వచ్చాడు.
ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం , బిజెపి లతో పాటు కలిసి పొత్తుల భాగంగా పోటీ చేసింది. ఈ ఎన్నికలలో ఈ జనసేన పార్టీ నుండి పోటీ చేసిన ప్రతి ఒక్క అసెంబ్లీ , పార్లమెంటు అభ్యర్థి గెలుపొందాడు. దానితో పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయం దక్కింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులను వ్యవహరిస్తున్నాడు. ఇలా పది సంవత్సరాలు ఎన్నో ఎత్తు పల్లాలని చూసిన పవన్ ఇప్పుడు అద్భుతమైన స్థాయిలో ఉన్నాడు.