ఆ ఊరిలో బాలయ్య క్రేజ్ వేరే లెవెల్.. 11 సినిమాలతో అక్కడ చరిత్ర సృష్టించాడుగా!

Reddy P Rajasekhar
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బాలయ్య సినిమాలు రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం పక్కా అని చెప్పవచ్చు. రాయలసీమ జిల్లాల్లో బాలయ్యను ఫ్యాన్స్ ఎంతో అభిమానిస్తారు. బాలయ్య సినిమాల హక్కులు సైతం సీడెడ్ లో రికార్డ్ స్థాయి రేటుకు అమ్ముడైన సందర్భాలు ఉన్నాయి.
 
బాలయ్య నటించిన లెజెండ్ మూవీ కడప జిల్లాలోని ఒక కేంద్రంలో ఏకంగా 1100 రోజుల పాటు ప్రదర్శితం అయింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో బాలయ్య క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ ఎక్కువ రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించిన సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పెద్దన్నయ్య సినిమా నుంచి లెజెండ్ వరకు ఏకంగా 11 సినిమాలు ఇక్కడ 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడాయి.
 
లెజెండ్ మూవీ ఇక్కడ ఏకంగా 421 రోజుల పాటు ప్రదర్శితం అయిందంటే ఈ సినిమా ఇక్కడి అభిమానులకు ఏ స్థాయిలో నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో బాలయ్య ఒకరు. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు అంటే అభిమానులకు సైతం ఎంత సంతోషమో చెప్పాల్సిన అవసరం లేదు.
 
బాలయ్య బాబీ కాంబో మూవీ, అఖండ2 సినిమాలతో బాలయ్య సరికొత్త రికార్డులను సొంతం చేసుకోవడం పక్కా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ హీరోలలో వరుస విజయాలను అందుకుంటున్న బాలయ్య సక్సెస్ రేట్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. డబ్బింగ్ సినిమాలతో బాలయ్య ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో బాలయ్య పారితోషికం ఉండగా బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: