ఇండియాలోని అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం... బాలయ్య వల్లే సాధ్యమంటూ?

Reddy P Rajasekhar
సాధారణంగా ఎవరైనా విద్య, వైద్య రంగాలలో ఎంట్రీ ఇచ్చారంటే లాభాలే ప్రధానంగా అడుగులు వేస్తారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో భిన్నమనే చెప్పాలి. ఒకవైపు సినిమాలతో బాలయ్య ఎంత బిజీగా ఉన్నా మరోవైపు బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ గా బాలయ్య తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
 
మన దేశంలోనే రెండో అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రి బసవతారకం ఆస్పత్రి అంటే ఈ ఆస్పత్రి అభివృద్ధి కోసం బాలయ్య ఎంత కష్టపడ్డారో సులువుగా అర్థమవుతుంది. ఎంతోమంది క్యాన్సర్ రోగులకు ఈ ఆస్పత్రిలో చికిత్స అందింది. ఈ ఆస్పత్రి ద్వారా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుని చాలామంది రోగులు ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతుండటం గమనార్హం.
 
బాలయ్య ఈ ఆస్పత్రి ద్వారా ఆపదలో ఉన్న పేదలకు సైతం చికిత్స అందేలా చేస్తూ తన మంచి మనస్సును చాటుకుంటున్నారు. అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉండగా పేదలకు తక్కువ ఖర్చుతోనే వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రికి గూగుల్ లో సైతం పాజిటివ్ రివ్యూలు ఉండటం ఎక్కువమంది ఆస్పత్రి సేవలపై పాజిటివ్ గా స్పందించడం గమనార్హం.
 
బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా సీనియర్ హీరోలలో ఒకరైన బాలయ్య తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలయ్యకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య యంగ్ డైరెక్టర్లకు సైతం బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. చాలామంది యంగ్ డైరెక్టర్లు బాలయ్యతో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం సత్తా చాటే విధంగా బాలయ్య ప్లాన్స్ ఉన్నాయి. బాలయ్య వల్లే బసవతారకం ఆస్పత్రికి అరుదైన ఘనతలు సాధ్యమయ్యాయని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: