2029 ఎన్నికల్లో సైతం కేంద్రంలో బీజేపీదే విజయం.. మోదీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Reddy P Rajasekhar
కేంద్రంలో 2014 సంవత్సరం నుంచి మోదీ సర్కార్ అధికారంలో ఉందనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సైతం నాలుగోసారి విజయం సాధించి రికార్డ్ సృష్టిస్తామని తెలిపారు. గ్లోబల్ ఫిన్ టెక్ టెస్ట్ లో పాల్గొన్న మోదీ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
 
ఇది ఐదో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ అని మోదీ తెలిపారు. 2029 సంవత్సరంలో జరిగే సమావేశాలకు సైతం నేను వస్తానని మోదీ వెల్లడించారు. గతంలో మన దేశానికి వచ్చే విదేశీ అతిథులు ఇక్కడి సంస్కృతిక వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయేవారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మాత్రం ఫిన్ టెక్ పురోగతి చూసి ఆశ్చర్యపడుతున్నానని మోదీ వెల్లడించడం కొసమెరుపు. అదే సమయంలో మోదీ విపక్షాలపై కూడా ఫైర్ అయ్యారు.
 
విపక్షాలు గ్రామాలలో విద్యుత్ కనెక్షన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు లేవని భారత్ పురోగతి గురించి అనేకమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో మన దేశం గణనీయ పురోగతి సాధించిందని మోదీ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2014, 2019 సంవత్సరాలలో బీజేపీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించి అధికారం సొంతం చేసుకుంది.
 
2024 ఎన్నికల్లో మాత్రం మోదీ సర్కార్ 272 సీట్ల మార్కును సాధించలేకపోయిందనే సంగతి తెలిసిందే. బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. 2029 సంవత్సరం సమ్మర్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 2029 లోక్ సభ ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. నరేంద్ర మోదీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేంద్ర మోదీ కామెంట్లపై విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: