చంద్రబాబుకి షాక్ ఇచ్చిన మోదీ? తాము చెప్పింది వింటేనే నిధులు !

Chakravarthi Kalyan

కేంద్రం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సంబంధించిన అంశాల్లో సానుకూలంగా స్పందిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి వర్గ సమావేశాంలో పోలవరం నూతన డీపీఆర్ కు ఆమోద ముద్ర లభించింది.  ఇదే సమయంలో కేంద్రం కొన్ని షరతులు విధించింది. ప్రాజెక్టు నిర్మాణంపై నిర్దేశించింది.


2027 ప్రారంభానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తాజా సమాచారం.  పోలవరం కొత్త డీపీఆర్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.30436.95 కోట్లను తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు డీపీఆర్ ఆమోదించగా.. రాష్ట్రానికి రూ.12157 కోట్లు దక్కనున్నాయి. ఈ సమయంలో కొన్ని షరతులు సైతం విధించింది. 2026 మార్చి నాటికే తొలి దశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 2027 ప్రారంభానికి పనులు పూర్తి చేస్తేనే తదుపరి నిధులు ఇస్తామనే కండీషన్ పెట్టింది.


తాజా డీపీఆర్ తో 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలి దశను 2027 మార్చి నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొంది. కేంద్రం నిధులు కేటాయించడం నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఫేజ్‌-1 కి రూ.30437 కోట్లను అంచనా వేసినట్లు వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరఫున రూ.4730 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా చూశామని తెలిపారు.


 కేంద్రం నుంచి రూ.25706 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటికే 15146 కోట్లు విడుదల అయ్యాయి. భూసేకరణ, మిగిలిన రూ.12127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిలబెట్టాలంటే మరో రూ.25వేల కోట్లు అవసరం అవుతాయి. ఇందులో నిర్వాసితులు, భూసేకరణ, పునరావాసానికే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో మరో డీపీఆర్ ఆమోదం పొందాలంటే 2027 ప్రారంభానికి ముందు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: