హైడ్రాపై కాంగ్రెస్ లో మొదలైన లుకలుకలు.! రేవంత్ కి మరో సమస్య?
తెలంగాణ రాజకీయాలను హైడ్రా హడలెత్తిస్తోంది. దీనిపై ప్రతి పక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నట్లు సమచారం. రాష్ట్రంలో చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఏఐసీసీ సమర్థించినట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చి వేతలపై సొంత పార్టీ సీనియర్ నేతలు, ఇతరులు ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది.
జంట జలాశయాల్లో ఉస్మాన్ నగర్, హుస్మాన్ సాగర్ లో ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో ఏపీ కాంగ్రెస్ లీడర్లకు చెందిన ఫామ్ హౌజ్ నిర్మాణాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ లీడర్లు నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంలోనే తమకు న్యాయం జరగడం లేదని ఏఐసీసీ ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్న కొందరు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు సైతం సీఎం రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంట. వెంటనే కూల్చివేతలను ఆపేయించాలా ఆదేశాలు ఇవ్వాలని కోరగా.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనే విషయాలపై ఏఐసీసీ ఆరా తీసింది.
హైడ్రా కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధిష్ఠానం ఫీల్డ్ లెవల్ ఒపీనియన్ సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వివిధ ఎన్జీవోలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు, బిజినెస్ పర్సన్స్, కామన్ పబ్లిక్ నుంచి సమాచారం సేకరించారు. అయితే మెజార్టీ పీపుల్ దీనిపై పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడంతో సీఎం రేవంత్ చేపడుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ ను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మధ్య దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కార్యక్రమాలను కూడా పార్టీ అగ్రనేతలకు వివరించారని టాక్. మొత్తానికి ఏఐసీసీ నుంచి ఫుల్ సపోర్టు తో రేవంత్ కూల్చివేతలను చేపడుతున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.