పవన్ ఆశయం నెరవేరడం సాధ్యమేనా..?
అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ నిధులను ముందుగా తమ ఖర్చులకు వాడుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కసారి ఈ పంచాయతీ విడుదలను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇది దేశమంతా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందట. అలా పంచాయతీ నిధులను వాడుకొని మరి తిరిగి ప్రభుత్వాలు సైతం నెమ్మదిగా ఇస్తూ ఉండేవి. కానీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ మాత్రం పంచాయతీ నిధులను ఒక రూపాయి కూడా పక్కదారి మళ్ళించకుండా చూస్తామని తెలియజేస్తున్నారు.
అందుకే అన్ని నిధులు కూడా గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు మరిన్ని నిధులు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరొకవైపు గ్రామీణ ఉపాధి పథకానికి ఇచ్చే నిధులను కూడా గ్రామస్థాయిలో పనికి రాకపోయినా కూడా వచ్చినట్లుగా రాయించేసి పలు రకాల డబ్బులను తీసుకుంటున్నారట. ఇలా ఎవరు అధికారంలోకి వస్తే వారు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటిని కూడా అరికట్టేందుకు పూర్తి నిగా పెట్టాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగానే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ ఆశయాన్ని నెరవేర్చుకుంటే మాత్రం పంచాయతీలలో జనసేన పార్టీకి తిరుగు ఉండదని చెప్పవచ్చు. మరి ఇది ఆచరణ సాధ్యమవుతుందా లేదా చూడాలి.