అక్కడా మంత్రే ఇక్కడా మంత్రే.. బాబుకు దక్కిన అదృష్టం మరే నేతకు దక్కదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సరైన దారిలో ముందుకు నడిపించే నేత ఎవరనే ప్రశ్నకు ఏ మాత్రం సందేహం అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు పేరు సమాధానంగా చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తన తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించగల మేధావి అనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలని భావించే ఎంతోమందికి ఆయన స్పూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
 
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మాటను జవదాటే నేత టీడీపీలో ఉండరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేయడంతో పాటు ఇటు టీడీపీలో సైతం మంత్రిగా పని చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా 28 సంవత్సరాల వయస్సులోనే బాబు పని చేశారు.
 
అప్పటికి కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రి చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 1980 నుంచి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేయడం జరిగింది. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ కాంగ్రెస్ లో ఉన్న సమయంలో బాబు సంచలన ప్రకటన చేశారు.
 
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఓటమిపాలైన బాబు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాబు పాలనలో అమరావతిలో ఊహించని స్థాయిలో అబివృద్ధి జరగనుందని ప్రజలు సైతం నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: