వైసీపీ, జగన్ ను నిండా ముంచేసిన చెవిరెడ్డి సర్వేలు.. నమ్మి పెద్ద తప్పు చేశారా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల ముందు ఏ సర్వే చూసినా వైసీపీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని సంక్షేమ పథకాలే వైసీపీకి శ్రీరామరక్ష అయ్యాయని కామెంట్లు వినిపించాయి. ఆరామస్తాన్, ఆత్మసాక్షి మరికొన్ని ప్రముఖ సర్వే సంస్థలు వైసీపీదే విజయమని తేల్చి చెప్పాయి. జగన్ సైతం 2019 ఎన్నికలకు మించిన ఫలితాలను సాధిస్తామని చేసిన కామెంట్లు నిజమవుతాయని వైసీపీ శ్రేణులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
 
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించిన సర్వేలు పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించాయని చాలామంది భావిస్తారు. చెవిరెడ్డి ప్రతి సర్వేలో వైసీపీ కచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందనే విధంగా సర్వేలు రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం కొన్ని నియోజకవర్గాల్లో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ల ఓటమికి వాళ్లే కారణం కావడం జరిగింది.
 
సర్వేలను నమ్ముకోకుండా వైసీపీ పని చేసి ఉంటే కచ్చితంగా పావు వంతు స్థానాల్లో అయినా పార్టీకి అనుకూల ఫలితాలు దక్కి ఉండేవని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వైసీపీ గతంలో చేసిన తప్పుల గురించి ఇప్పుడు బాధ పడినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ఎన్నికల తర్వాత ప్రజల తీర్పును తాను కచ్చితంగా అంగీకరిస్తానని వెల్లడించారు.
 
అయితే జగన్ ఇంత దారుణంగా పరాజయం ఎదురైందంటే అందుకు గల కారణాలను సైతం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కూటమిని ప్రజలు నమ్మడం వెనుక గల కారణాలను సైతం విశ్లేషించుకొని అడుగులు వేయల్సి ఉంది. వైసీపీ ఎన్నికల్లో ఓటమిపాలైనా ఆ పార్టీకి ఏకంగా 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఎన్నికల ముందు జరిగిన దుష్ప్రచారం సైతం పార్టీకి మైనస్ అయింది. జగన్ రాబోయే రోజుల్లో మళ్లీ పాదయాత్ర చేయాలని కూడా వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. కుటుంబంలో విబేధాలు సైతం జగన్ కు ఒకింత మైనస్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: