జగన్ అధికారం కోల్పోవడంలో సజ్జల పాత్ర కీలకమా.. ఆయన నిర్ణయాలే పార్టీని ముంచేశాయా?

Reddy P Rajasekhar
సాధారణంగా ఒక ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన పార్టీ మరో ఎన్నికల్లో ఫలితాల విషయంలో నిరాశపరచడం జరుగుతుంది. అయితే వైసీపీ విషయంలో మాత్రం 2019 ఎన్నికల ఫలితాలతో పోల్చి చూస్తే 2024 ఎన్నికల్లో ఒకింత దారుణమైన ఫలితాలు వచ్చాయి. వైసీపీకి 11 స్థానాల్లో మాత్రమే విజయం దక్కుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ చిత్తుచిత్తు అవుతుందని కూటమి నేతలు సైతం భావించలేదు.
 
వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న నియోజకవర్గాల్లో సైతం పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజల్లో చాలామంది వైసీపీ పాలన నచ్చలేదని అందుకే కూటమికి ఓటేశామని చెబుతున్నారు. కూటమి సంక్షేమ పథకాలు ప్రజలకు ఆకట్టుకున్నా అదే సమయంలో వైసీపీ తీరు నచ్చక ఓటు వేసిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం కొసమెరుపు.
 
అయితే వైసీపీ దారుణ పరాజయానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలామంది ఫీలవుతున్నారు. వైసీపీకి 11 సీట్లు రావడంలో సజ్జల పాత్ర కీలకమని చాలామంది భావిస్తున్నారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై వ్యవహరించడం కూడా ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ అందుబాటులో ఉండాల్సిన చోట సజ్జల అందుబాటులో ఉంటూ పార్టీకి పరోక్షంగా చేటు చేశారు.
 
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు యాక్టివ్ గా ఉన్న సజ్జల ఫలితాలు వెలువడిన రోజు నుంచి సైలెంట్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలు సైతం పార్టీకి చేటు చేశాయి. అయితే ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అంగీకరించరు. మరోవైపు జగన్ సైతం పార్టీలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే పార్టీ పరిస్థితి మారే అవకాశం అయితే ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాబోయే రోజుల్లో వైసీపీలో ప్రాధాన్యత పెరుగుతుందో తగ్గుతుందో చూడాల్సి ఉంది. సజ్జల పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: