బాబు గారూ.. నిధులివ్వలేమంటున్న మోదీ?

Chakravarthi Kalyan
ఏపీలో ఉచితాలకు బీజేపీ దూరం.  మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అమలు చేయాల్సిన మ్యానిఫెస్టో మాత్రం టీడీపీ-జనసేనలదే. ఇక ఎన్నికల వేళ చంద్రబాబు ఎడాపెడా హామీలు ప్రకటించేశారు. వాటిని బాగా ప్రచారం చేసి సక్సెస్ అయి అధికారంలోకి వచ్చారు. కానీ తనకు కేంద్రం అండ ఉంటుందని చంద్రబాబు భావించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దీంతో కేంద్రం మద్దతుతో ఎలాగైనా పథకాలు అమలు చేయొచ్చని చంద్రబాబు భావించారు. అసలే కేంద్రంలో సంకీర్ణం రావడం.. ఇందులో టీడీపీయే కీరోల్ పోషించడంతో ఇక ఏపీకి తిరుగులేదని అంతా భావించారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం కూడా బడ్జెట్ లో ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఇక ఏపీ పై కేంద్రంచూపు ఉంటుందని భావిస్తున్న తరుణంలో టీడీపీ కి బీజేపీ షాక్ ఇచ్చింది.

గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఆ పార్టీ కి యమపాశంలా తయారై ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది అనే వాదనలు ఉన్నాయి. ఈ యాక్ట్ లో భూములు రీసర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. ఇందులో భాగంగా 11929 గ్రామాల్లో డ్రోన్ సర్వే, రోవర్లతో హద్దులు నిర్ణయించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది.  దీంతో పాటు యాజమాన్య హక్కులు పత్రాల పంపిణీకి రూ.117 కోట్లను ఇవ్వాలని కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం కోరింది.

గత నాలుగేళ్లలో పథకం నిర్వహణకు రాష్ట్రం తరపున నిధులు కేటాయించలేదు. ఈ కారణం చేత పై అమౌంట్ ను ఇచ్చేందుకు కేంద్రం విముఖత  వ్యక్తం చేసింది. ఈ సాకును చూపి ఏపీకి ఇవ్వాల్సిన రూ.117 కోట్లను కేంద్రం నిలిపివేసింది. అయితే దాదాపు ఏడు వేల్ల గ్రామాల్లో డ్రోన్ సర్వేలు ప్రారంభం కూడా అయ్యాయి. హద్దు రాళ్లు కూడా పాటించారు. అయినా గత ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు అంటూ బోడి గుండుకు మోకాలి కి ముడి పెట్టి నిధులను కేటాయించకుండా ఆపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: