మాంసం తినడం ఇష్టం లేదా.. ఇది తింటే చాలు..!

Divya
ప్రస్తుతం జీవనశైలి కారణంగా.. 60 ఏళ్ల తర్వాత రావలసిన నొప్పులు సైతం ఈ మధ్యకాలంలో యువతకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సరైన వ్యాయామాలు చేయకపోవడం వల్ల, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తినేటువంటి ఆహారం పైన చాలా శ్రద్ధ పెట్టాలి అని ముఖ్యంగా చాలామంది మాంసాహారాలు తింటే ఎముకలు దృఢంగా అవుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ మాంసాహారం లోనే మాత్రమే కాదు శాకాహారం ద్వారా కూడా ఎముకలను దృఢంగా చేసుకోవచ్చట.

మెంతికూర, పాలకూర, తాజా కాయగూరలలో  ఎక్కువగా మేలు చేసే పదార్థాలు ఉంటాయి. కూరగాయలలో ఎక్కువగా కాల్షియం వంటి పదార్థం లభిస్తుంది దీని వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారు అవ్వడమే కాకుండా చర్మం మెరవడానికి ప్రేగులు శుభ్రపరచడానికి కూడా కూరగాయలు చాలా ఉపయోగపడతాయి.

చాలా మంది పాలు తాగడం అంటే ఇష్టం ఉండదు ఇలాంటివారు పెరుగు తినడం ఉత్తమం ఎందుకంటే ఇందులో క్యాల్షియం ,పొటాషియం ,విటమిన్ B-12 ఇతరత్రా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. పుల్లని పెరుగు తాగడం వల్ల ఎముకలు చాలా దృఢంగా అవ్వడమే కాకుండా ఎలాంటి వ్యాధులను కూడా రానివ్వకుండా శరీరంలో ఒక ప్రొటెక్షన్ గా పని చేస్తుందట.

బాదంపప్పుతో పాటు జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇతరత్రా వాటిని డ్రై ఫ్రూట్స్ కింద తినడం వల్ల ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్లి మనం కాపాడుకోవచ్చు.

నిమ్మ, పైనాపిల్, ద్రాక్ష ఇతరత్ర ఉన్నటువంటి వాటినీ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది పుల్లటి పదార్థం కలిగినవి కనుక ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇవి ఎముకల సమస్యలను రాకుండా చూస్తాయట. ఇదే కాకుండా మరిన్ని ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: