వైసీపీ మాజీ మంత్రిపై ఏసీబీ ఎటాక్... ఒక్కటే టెన్షన్..?
- 15 మంది అధికారుల తనిఖీలతో వైసీపీ లో బిగ్ టెన్షన్
- అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ.. అక్రమ అమ్మకాలు గుర్తింపు
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుండడం తో పాటు ఒకేసారి 15 మంది అధికారులు రంగంలోకి దిగడంతో ఈ రోజు ఉదయం నుంచే వైసీపీలో ఒక్కటే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు మొదలయ్యాయి. మొత్తం 15మంది అధికారులతో తనిఖీలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఇబ్రహీంపట్నంలో ని ఆయన నివాసంలో ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఈ తనిఖీలు నడుస్తున్నాయి.
జోగి రమేష్ మంత్రి గా ఉన్నప్పుడు ఆ అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన పై అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి భారీగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కోనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారని తెలుస్తోంది.
జోగి రమేష్ వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భారీ ఎత్తున మంది మార్బలంతో చంద్రబాబు ఇంటి పై దాడి చేసి నానా హంగామా చేశారు. ఈ దాడి చేసినందుకు బహుమానంగానే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఆయనను పెడన నుంచి పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. బోడే ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు.