చంద్రబాబు: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు !

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టారు. ఎన్నికల కంటే ముందు చెప్పినట్లుగానే... అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమాత్రం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా... తన పాలనను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక శాఖలో కీలక మార్పులు తీసుకువచ్చారు నారా చంద్రబాబు నాయుడు.


ముఖ్యంగా ఏపీ వాలంటీర్ వ్యవస్థ ను ఎన్నికల కంటే ముందు చెప్పినట్లుగానే... ఆ వ్యవస్థను వాడకుండానే పనులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.  ఆ వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా సంక్షేమ పథకాలు ఆగవని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టనుంది నారా చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తంగా 10960 గ్రామ సచివాలయాలు, 4044 వార్డు సచివాలయాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో 1.61 లక్షల గ్రామ, వార్డు సెక్రటరీలు పని చేస్తున్నారు.  అయితే.. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది నారా చంద్రబాబు నాయుడు సర్కార్‌. కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోన్నారు.


గ్రామాల్లో ఏఎన్ఎం, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు సర్కార్‌. పట్టణ పరిధిలోని వార్డుల్లో  అడ్మిన్, శానిటరీ, విద్యా, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేస్తున్నారు చంద్రబాబు. మిగిలిన సెక్రటరీలను క్లస్టర్ వ్యవస్థలో వివియోగించుకోనున్న ప్రభుత్వం....గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీ రాజ్ పరిధిలోకి తెచ్చే ఆలోచనలో ఉందని సమాచారం. మరి కొన్ని ప్రతిపాదనలనూ పరిశీలిస్తోంది నారా చంద్రబాబు నాయుడు సర్కార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: