పది రూపాయల కాయిన్ల విషయంలో వాస్తవాలు ఇవే.. చెల్లవని చెబితే మాత్రం చెరశాలే!

Reddy P Rajasekhar
మన దేశంలో పది రూపాయల కాయిన్లకు సంబంధించి ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ నాణేలు చెల్లుతాయని అందరికీ తెలిసినా వీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడటం లేదు. పది రూపాయల నాణెం తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇష్టపడటం లేదు. విచిత్రం ఏంటంటే బస్సుల్లో సైతం మెజారిటీ సందర్భాల్లో కండక్టర్లు ఈ కాయిన్లను నిరాకరిస్తున్నారు.
 
ఆర్బీఐ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పందించి పది రూపాయల కాయిన్ల విషయంలో వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేసింది. పది రూపాయల కాయిన్ ఏ డిజైన్ లో ఉన్నా ఏ ఆకృతిలో ఉన్నా చెల్లుతుందని ఆ నాణేన్ని తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ సూచిస్తోంది. ఎవరైనా ఆ నాణేలను నిరాకరిస్తే చట్టపరంగా శిక్షార్హులని ఆర్బీఐ చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
చిన్నచిన్న వ్యాపారులు సైతం పది రూపాయల నాణెం సైతం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. చినిగిపోయిన పది రూపాయల నోటు అయినా తీసుకుంటున్నారు కానీ పది రూపాయల కాయిన్ తీసుకోవడానికి మాత్రం ఇష్టపడటం లేదు. బడా మాల్స్ లో సైతం 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.
 
చాలా బ్యాంక్ లలో పది రూపాయల కాయిన్లు లక్షల రూపాయల్లో పేరుకుపోయినట్టు సమాచారం అందుతోంది. పది రూపాయల నాణేల విషయంలో అపోహలు తొలగించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. ఆర్బీఐ ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. పది రూపాయల కాయిన్ల విషయంలో రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తే మాత్రమే పది రూపాయల కాయిన్లను తీసుకోవడానికి చిరు వ్యాపారులు ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రజలలో చాలామంది తమ దగ్గర చాలా కాలం నుంచి పది రూపాయల కాయిన్లు ఉండిపోయాయని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: