బంగ్లాదేశ్‌ ప్రధాని రాజీనామా చేయడానికి ఈ 26 ఏళ్ల కుర్రాడే కారణం..?

frame బంగ్లాదేశ్‌ ప్రధాని రాజీనామా చేయడానికి ఈ 26 ఏళ్ల కుర్రాడే కారణం..?

Suma Kallamadi


బంగ్లాదేశ్‌లో ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రొటెస్టులో భాగంగా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రధాని హసీనా బంగ్లాదేశ్ విడిచి పారిపోయారు. దాంతో ఆమె జీవితం అంధకారం అయ్యింది. కొంత సమయంలోనే ఆమె సర్కార్ కొప్పు కూలింది కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. అయితే దీనంతటికీ కారణం ఓ 26 ఏళ్ల కుర్రాడు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది దాంతో అందరూ షాక్ అవుతున్నారు. దేశంలో ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థాయికి అతడు ఆందోళనను తీసుకువెళ్లాడనే నిజాన్ని చాలామంది త్వరగా నమ్మలేకపోతున్నారు కానీ ఇది నిజం. 

చిన్న ఆందోళనగా అతడు రిజర్వేషన్ల ఉద్యమం మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్‌ పతాకాన్ని నుదుటకు చుట్టుకొని నిరసనలు చేశాడు. మీడియా అతడి నిరసనలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆ ఉద్యమాన్ని మాత్రం అతడు వీడలేదు. మొత్తం ఉద్యమాన్ని చివరి వరకు అతడే నడిపించాడు. ఆ కుర్రాడి పేరు నహిద్‌ ఇస్లామ్‌! ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ కోర్సు చేస్తున్నాడు. 2024 జులైలో తొలిసారిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్‌ కొంతమంది విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపట్టాడు. 

 పోలీసులు రంగంలోకి దిగి ఆ విద్యార్థులను అరెస్టు చేశారు. అప్పుడే నహిద్‌ బంగ్లాదేశ్‌ ప్రజల దృష్టిలో తొలిసారిగా పడ్డాడు. ఈ చిన్న ఉద్యమం చూస్తుండగానే అతి పెద్దదిగా మారింది. ఒక పెను తుఫాన్ గా అది మారి హసీనా ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. ఈ ఉద్యమం కారణంగా ఏకంగా 300 మంది విద్యార్థులు అత్యంత విషాదకర పరిస్థితులలో ప్రాణాలు విడిచాడు. అందరూ వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు. ఈ సంఖ్యలో వాళ్లు చనిపోవడం పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిస్థితి దిగజారడంతో హసీనా పీఎం పదవికి రిజైన్ చేసి ఇండియాకు పారిపోయారు.

ఈ సాయంత్రం, నహిద్, ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌ను కలవనున్నారు. వారు సైన్యం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం రెండింటినీ తిరస్కరించారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనిస్‌ను ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం కోరుకుంటుంది, అయితే విద్యార్థుల ఆమోదం తీసుకోని ఏ ప్రభుత్వమూ ఆమోదయోగ్యం కాదని నహిద్ నొక్కి చెప్పారు. 1998లో ఢాకాలో జన్మించిన నహిద్‌ను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసినా నిర్భయంగా పోరాడుతూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: