మగతనం తగ్గిపోతోందా.. ఏఐ చెప్పేస్తుంది?
ఇక సంతాన లేమితో బాధపడుతూ ఓ జంట వైద్యలను సంప్రదిస్తే.. మహిళలను పరీక్షించినట్లుగానే.. పురుషులను కూడా పరీక్షిస్తున్నారు. అయితే పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అందుబాటులో ఉన్న మార్గం వీర్య పరీక్ష. ఇప్పటి వరకు ఈ పరీక్ష ద్వారానే మగవారిలో సంతాన సామర్త్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే ఇది కాస్త ఇబ్బంది, సమయంతో కూడిన అంశం. అలా కాకుండా ఒక చిన్న పరీక్ష ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. అది ఎలాం అంటే..
కృత్రిమ మేధ(ఏఐ)ను మరింత అభివృద్ధి చేశారు. జపాన్ లోని టోహో యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. కేవలం ఓ చిన్న పరీక్ష ద్వారా రక్తంలో ఎఫ్ఎస్హెచ్, ఎల్ హెచ్, పీఆర్ఎల్, టోటల్ టెస్టో స్టెరాన్, ఈ2 వంటి వివిధ హర్మోన్ల స్థాయిలను విశ్లేషించి 74 శాతం కచ్చితత్వంతో పురుషుల్లో వంధ్యత్వాన్ని గుర్తిస్తుంది. కొందరు పురుషుల్లో ఉండే అజుస్పెర్మియా సమస్యను 100 శాతం కచ్ఛితత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు అంటున్నారు.
ఇందులో భాగంగా పరిశోధకులు.. 3662 మంది రోగుల వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా.. ఈ ఏఐ మోడల్ ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ హిడెయుకి కోబయిషి తెలిపారు. ఈ ఏఐ మోడల్ 2021, 2022లో పలువురిపై పరీక్షించగా..వంధ్యత్వానికి సంబంధించి 68 శాతం, అజెస్మెర్మియా కు సంబంధించి 100 వాతం కచ్ఛితత్వంతో ఫలితాలు వచ్చినట్లు ఆయన వివరించారు.