పొంగులేటి పై పగబట్టిన టీడీపీ కూటమి..?

Pandrala Sravanthi
 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయమంతా ఆయన కనుసాన్నాల్లోనే నడుస్తుంది. అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రస్తుతం ఏపీలో ఏర్పడిన టిడిపి ప్రభుత్వం కన్నెర్ర జేస్తోంది. తెలంగాణ మంత్రిపై టీడీపీ ప్రభుత్వం కన్నెర్రా జేయడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆయన తెలంగాణ మంత్రి అయినా, ఆయన కాంట్రాక్టులు చేసేవన్నీ ఏపీలోనే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉండేది.  రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వర్క్స్ జరిగిన టాప్ 3 కాంట్రాక్టర్స్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఒకటి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది .


కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకున్నటువంటి  చాలా కాంట్రాక్టులపై  టిడిపి ఆరా తీస్తోంది. ఆయనకు వచ్చిన కాంట్రాక్టులను   పూర్తి చేశాడా.. చేసిన పనులు నాణ్యతగా ఉన్నాయా అసలు ఎక్కడెక్కడ పనులు ప్రారంభించలేదు అనే విషయంపై పూర్తిస్థాయిలో డాటా రాబడుతుందట. ముఖ్యంగా విశాఖపట్నంలోని భూగర్భ విద్యుత్తు లైన్ పనులు చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని సైలెంట్ అయిపోయాడు.  అంతేకాదు కడపలో అన్నమయ్య డ్యాం నిర్మించే కాంట్రాక్ట్ కూడా రాఘవ సంస్థదే. అడ్వాన్సులు తీసుకొని పనులు కూడా ప్రారంభించలేదు. 


ఇలా రాష్ట్రంలోని చాలా కాంట్రాక్టులను అడ్వాన్సులు తీసుకొని ఇంకా పనులు ప్రారంభించకపోవడం, కొన్ని ప్రారంభించిన పూర్తి చేయకపోవడం వంటివి జరిగాయట. అంతే కాదు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం నెలకొకసారి అయినా వచ్చి జగన్ ను ఆయన కలిసే వారట. అలాగే ఎన్నికల సమయంలో  దాదాపు మూడు నుంచి నాలుగు జిల్లాల్లో వైసిపి ఖర్చు మొత్తం ఆయనే భరించారని టిడిపికి తెలిసింది.  దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాబట్టి ఆయన కంపెనీకి సంబంధించినటువంటి లోటుపాట్లు అన్నింటిని వెలికి తీసి నోటీసులు జారీచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: