జగన్ హయాంలో ఆంధ్రజ్యోతికి అంత అన్యాయం జరిగిందా?

Chakravarthi Kalyan
జగన్ తన సొంత పత్రికకు ఐదేళ్లపాటు జనం సొమ్మును దోచి పెట్టారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రికకు ఏకంగా రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. మిగిలిన అన్ని పత్రికలకు కలిపి రూ.488 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు. ఆంధ్ర జ్యోతికి ఉద్దేశ పూర్వకంగా ప్రకటనలు ఇవ్వలేదు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వివరాలను వెల్లడించింది. గత ప్రభుత్వం సర్క్యూలేషన్ ప్రాతిపాదికన తీసుకోలేదని..  పక్షపాత ధోరణితోనే ప్రకటనలు జారీ చేసిందని తెలిపింది.

ఈ మొత్తం వ్వవహారంపై విచారణ చేయిస్తామని అవసరం అయితే సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  గత ప్రభుత్వంలో వార్తా పత్రికలకు ప్రకటనలు జారీ అంశంలో పక్షపాత ధోరణిపై ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, బెందాళం అశోక్, తెనాలి శ్రవణ్ కుమార్ లు అడిగిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా సమచారా, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సమాధానం ఇచ్చారు.

జీవో 431 ప్రకారం ప్రకటనల జారీలో ఐ అండ్ పీ ఆర్ శాఖకు విచక్షాణిధికారం ఉంటుందని దీనిని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం అడ్డగోలు ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. ఈనాడు లాంటి పత్రికలు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదనే కారణంతో ప్రకటనలు వద్దని చెప్పాయని తెలిపారు. ప్రభుత్వాన్ని ఐ అండ్ పీ ఆర్ తప్పుదోవ పట్టిస్తుందని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

అయితే వైసీపీ హయాంలో ప్రకటనల ద్వారా సాక్షికి చెల్లించిన మొత్తం రూ.371.12 కోట్లు. ఇదే సమయంలో ఈనాడుకి రూ.243 కోట్లు, ఆంధ్ర జ్యోతికి రూ.27.98 కోట్లు, ఆంధ్ర ప్రభకి రూ.16.49 కోట్లు,  టైమ్స్ ఆఫ్ ఇండియాకు రూ.27.21 కోట్లు, దక్కన్ క్రానికల్ కు 45.82 కోట్లు చెల్లించారు.  జగన్ పత్రికకు సమాచార శాఖ ద్వారా జారీ అయిన ప్రకటనల విలువే రూ.371 కోట్లు. జగన్ ఛానల్ లో కూడా సొమ్ము గుమ్మరించారు. ఇక జిల్లా స్థాయిలో జగన్ పత్రికకు ఇచ్చిన విలువ  సభ దృష్టికి తీసుకురాలేదు. ఇవన్నీ కలిపితే కానీ మొత్తం జగన్ సొంత మీడియా కు దోచిపెట్టింది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: