నాడు హీరో నేడు జీరో.. సీఎం జగన్ ప్రస్తుత స్థితికి స్వీయ తప్పిదాలే కారణమా?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో జగన్ వైసీపీతో సాధించిన సంచలన ఫలితాలను ఎవరూ సులువుగా మరిచిపోలేరు. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడానికి కారణమై జగన్ గతంలో హీరోగా నిలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులలో చాలామంది ప్రజలకు పెద్దగా పరిచయం అభ్యర్థులు కాగా అలాంటి అభ్యర్థులు సైతం గెలిచారంటే జగన్ కారణమని చెప్పవచ్చు.
 
అయితే నాడు హీరో అయిన జగన్ నేడు జీరో అయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సీఎం జగన్ ప్రస్తుత స్థితికి స్వీయ తప్పిదాలే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 - 2024లో జగన్ పాలన మరీ తీసికట్టుగా లేకపోయినా 90 శాతం సంక్షేమానికి, 10 శాతం అభివృద్ధికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం జరిగింది.
 
జగన్ నుంచి సంక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారులలో చాలామంది వైసీపీకి ఓటు వేయలేదంటే జగన్ ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. జగన్ పాలనలో రాష్ట్రం అప్పు దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు పెరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మేధావి వర్గాలు సైతం జగన్ పాలన సంతృప్తికరంగా లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం కొసమెరుపు.
 
అయితే చంద్రబాబు అధికారంలోకి రావడానికి జగన్ ను మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పడమే కారణమని చాలామంది ఫీలవుతారు. చంద్రబాబు పథకాలను అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఒకింత కఠినంగా, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేలా ఉండనున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో బాబు ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి. జగన్ సరైన వ్యూహాలతో అడుగులు వేస్తే మాత్రమే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. నాడు జగన్ ను పొగిడిన వాళ్లే నేడు జగన్ ను తిడుతుండగా జగన్ ప్రస్తుత స్థితికి స్వీయ తప్పిదాలే కారణమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: