జగన్ యాక్షన్ ప్లాన్ షురూ... టార్గెట్ చెల్లెమ్మ?

Suma Kallamadi
వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2019 వ సంవత్సరంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక చెల్లెలిగా షర్మిల జగన్ కోసం అహర్నిశలు పాటు బడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తర్వాత జరిగిన పరిణామాలు గురించి కూడా విధితమే. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని అనూహ్య కారణాల వలన షర్మిల అన్న జగన్ తో విభేదించవలసి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన షర్మిల అన్నను ఉద్దేశించి పలు రకాల విమర్శలు చేయడం పరిపాటి అయింది. ఇక ఆ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు గురించి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయం పాలైంది.
ఇంతటి ఓటమికి కారణం ఏమిటని వైసిపి నాయకులు సమీక్షించుకున్నప్పుడు.. వారి ముందు ఒక ప్రతిబింబంలాగా వైయస్ షర్మిల చాలా స్పష్టంగా కనబడింది. బాహ్యంగా కనిపించే శత్రువు కన్నా, అంతర్గత శత్రువు చాలా డేంజర్ అనే నానుడి జగన్ రాజకీయ ప్రయాణంలో నిజమయింది. ప్రత్యక్షంగా కనబడుతున్న కూటమి ప్రభుత్వం వారిని విమర్శించడం చాలా మామూలే. కానీ చెల్లెలు స్థానంలో ఉండి కూడా జగన్ పైన వైయస్ షర్మిల వేస్తున్న విమర్శల బాణాలు వైసిపి పార్టీని గట్టిగానే డామేజ్ చేశాయి.
అయితే అన్నాచెల్లెళ్ల మాటల యుద్ధం ఎంతవరకు? అని అనుకుంటే... దానికి అంతు పంతులు లేకుండా పోతుంది. ఎన్నికల హడావుడి ముగిసిపోయి 52 రోజులు అవుతున్న, షర్మిల అన్నను వదలడం లేదు. వీలు చిక్కునప్పుడల్లా.. తనదైన మాటలతో అన్నపై రెచ్చిపోతుంది షర్మిల. మొన్నటికి మొన్న ఢిల్లీలో జగన్ ధర్నా చేసినందుకుగాను... షర్మిల జగన్ పై పలు రకాలుగా విమర్శలు చేస్తూ టార్గెట్ చేయడం ఇప్పుడు వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఢిల్లీలో అన్న జగన్ ఎందుకు ధర్నా చేస్తున్నాడో తనకి అసలు అర్థం కావడం లేదని విమర్శిస్తూ అనేక మాటలు చెప్పుకొచ్చింది. బాబాయ్ వివేకాను హత్య చేసినప్పుడు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు? పోలవరం నిధుల విషయంలో ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదు? ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? అంటూ పలు రకాలు విమర్శలు చేస్తోంది. ఇక ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ఆర్సిపి హైకమాండ్.. ఆపరేషన్ షర్మిలను లైన్ లో పెట్టినట్టు విశ్వసనీ వర్గాల సమాచారం. ముందు షర్మిల నోరు మూసి.. ఆ తర్వాత విపక్షాల భరతం పట్టాలని వైఎస్ఆర్సిపి నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికోసం త్వరలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమితో జతకట్టబోతున్నట్టు ఢిల్లీలో గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: