బాలయ్యను ఫాలో అవ్వొచ్చుగా పవన్.. రెండు పడవలపై ప్రయాణం తప్పదంటూ?

Reddy P Rajasekhar
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం జనసేన పార్టీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొంటారని కాల్షీట్స్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి క్లారిటీ రావడం లేదు. బాలయ్యలా పవన్ కళ్యాణ్ సైతం సినిమాలకు వేగంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మంచిదని చెప్పవచ్చు.
 
బాలయ్య సైతం పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏరోజు సినిమాలకు దూరం కాలేదు. వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో బాలయ్యకు బాగా తెలుసు. ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టినా సినిమాలను వదిలిపెట్టలేదు. బాలయ్య సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కొత్త సినిమాలు ప్రకటించకపోయినా ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.
 
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా ఆయనపై కొన్ని బాధ్యతలు ఉన్నా పూర్తిస్థాయిలో సినిమాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పడవలపై ప్రయాణం చేస్తే మంచిదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. పవన్ సినిమాలపై నిర్మాతలు భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు.
 
ఆ పెట్టుబడులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పై ఉంది. మూడు సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఒక్క సినిమాను సైతం విడుదల చేయలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: