చేతులెత్తేసిన ఎంవీవి సత్యనారాయణ.. అయోమయంలో జగన్?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వేడి తగ్గక ముందే ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన వేడి రాజుకుంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కావడంతో ప్రస్తుతం టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అదే సమయంలో అటు అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచి భంగపాటుకు గురైన వైసిపి.. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటుంది.

 ఈ క్రమంలోనే ఎవరిని ఇక బరిలోకి దింపాలి అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే లోకల్ బాడీస్ లో ఉన్న బలంతోనే ఇక ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పై చేయి సాధించాలని అనుకుంటుంది వైసిపి. వంశీకృష్ణ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. జీవీఎంసీ పరిధిలోని 98 మంది కార్పొరేటర్లు ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం ఓటర్ల సంఖ్య 841 గా ఉంది. అయితే వైసీపీ తరఫున ఇక్కడ పోటీకి ఎవరిని దింపబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 వాస్తవానికి 841 మందికి గాను 615 మంది బలం అటు వైసీపీకి ఉంది. దీన్ని బట్టి చూస్తే వైసిపి గెలవాలి. కానీ ప్రస్తుతం ఫిరాయింపులతో ఒకసారిగా రాజకీయం మారిపోయింది. కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాబ్జి పేరు వినిపిస్తోంది. వైసీపీ తరఫున మాత్రం మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఓలా గురువులు పేర్లు వినిపిస్తున్నాయి  సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎంత తక్కువలో తక్కువ ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని నేతల అంచనా.  దీంతో ఆర్థికంగా స్థితిమంతుడైన మాజీ ఎంపీ వైపు వైసీపీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సుముఖంగా లేరట. నా వల్ల కాదు అంటూ చేతులెత్తేసారట. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత తగులుతున్న ఎదురు దెబ్బలు కారణంగానే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి ఇక అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంవివి విశాఖలో ఎక్కడ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ సీటు వద్దు మీరు వద్దు అంటూ పూర్తిగా చేతులెత్తేసారట ఎంవివి సత్యనారాయణ. మరి జగన్ ఆయనను ఒప్పిస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mvv

సంబంధిత వార్తలు: