• 2025 ఎన్నికల తర్వాత వైసీపీ పతనం స్టార్ట్
• భవిష్యత్తు లేదనుకుంటూ ఒక్కొక్కరుగా వీడుతున్నారు
• గుంటూరులో జగన్‌కు కోలుకోలేని దెబ్బ
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది. దాని తర్వాత పార్టీలోని ఒక్కొక్కరు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరిపాలన పట్ల ఏపీ ప్రజలు చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా వారి పక్షానే ఉండటం వల్ల కేంద్రం నుంచి కూడా నిధులు బాగానే వస్తున్నాయి. జగన్ మాత్రం తాను సింగిల్ గా వస్తాను అని చెబుతూ ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ఏపీలో కనీసం రోడ్లు కూడా వేయలేదని చాలామంది విమర్శించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంత చెప్పినా కూడా జగన్ వినిపించుకోలేదని కొందరు బహిరంగంగానే విమర్శలు చేశారు. వైసీపీ ఇంత పెద్ద ఓటమిని చవిచూసిందంటే దానికి కారణం కేవలం జగన్ మొండి వైఖరే అని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే జగన్‌ను నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు లేనట్లే అని భావిస్తున్నారు. అలా అనుకునేవారు వైసీపీని వీడుతున్నారు. ఇటీవల పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇది జగన్ కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.
గుంటూరు జిల్లాలో తన సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం పెట్టి దాని తర్వాత తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రోశయ్య సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు వైసీపీపై సంచలన విమర్శలు చేశారు. జగన్ పార్టీని కొందరు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని ఇక్కడ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపే లభించదని ఆయన అన్నారు. "చర్చలు జరపరు. కష్టపడిన వారికి పదవులు ఇవ్వరు. ఎన్నికల తర్వాత కూడా ఎవరి ఇష్టానుసారం వారు నడుచుకుంటారు. ఇలాంటి పార్టీలో కొనసాగడం నావల్ల కాదు." అని కిలారు రోశయ్య తన రాజీనామా వెనుక ఉన్న కారణాన్ని స్పష్టంగా తెలిపారు. ఇక మిగతావారు కూడా ఇంచుమించు ఇలాంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. మరి వచ్చే ఐదేళ్లలో జగన్ తరఫున ఎవరుంటారో చూడాలి.