ట్రంప్ అంతగా మారిపోయాడా? కారణం అదేనా?

Chakravarthi Kalyan
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నిన్నటి దాకా జో బైడెన్, ట్రంప్  మధ్య ఉన్న పోటీ లో అనూహ్యంగా జో బైడెన్ తప్పుకొన్నారు. తాను కేవలం పోటీ నుంచి మాత్రమే తప్పుకొన్నానని.. అయితే ఆయన స్థానంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను బరిలో డెమొక్రటిక్  పార్టీ బరిలో దింపింది.

అయితే ఇలాంటి ఘటన అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అసలు ఇలాంటి వింత ఆలోచన కూడా ఎవరికీ వచ్చి ఉండదు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరగడం కూడా ఎప్పుడూ చూడలేదు. బైడెన్ పై వ్యతిరేకత లేకపోయినా.. ఆయన వయసు పెరగడంతో జ్ఙాపకశక్తిపై అనుమానాలు పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ గెలుపు వైపు పయనిస్తున్నారన్న సర్వేలు వ్యక్తం అయ్యాయి. ఎప్పుడు అయితే కాల్పుల ఘటన జరిగిందో అమాంతం ఆయన ఇమేజ్ పెరిగింది. దీంతో అప్రమత్తం అయిన డెమొక్రటిక్ పార్టీ బైడెన్ ను పోటీ నుంచి తప్పించాలని సూచించింది.  చేసేదేమీలేక బైడెన్ బైబై చెప్పేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఎలాంటి వారో అందరికీ తెలిసిందే. దూకుడైన ఆయన తీరు పట్ల సొంత పార్టీలోనే మొదట్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. ట్రంప్ వస్తే తమకు ఇబ్బందే అని వారంతా భావించారు. దీంతో మూకుమ్మడిగా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. కానీ ట్రంప్ ఎలాగోలాగూ పంతం నెగ్గించుకున్నారు. అయితే ఎన్నికల రేసు ముందుకు సాగేకొద్దీ ఆయన వైఖరి మారిపోయింది. దీంతో ట్రంప్ పట్ల పార్టీ నేతల ఆలోచన తీరు కూడా మారింది.

ఇప్పుడు వారంతా ట్రంప్.. ట్రంప్ అంటూ హోరెత్తిస్తున్నారు. దీంతో పాటు ఆయన కూడా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణే.. ఇటీవల ఓ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి.. తాజాగా జరిగిన సభకు హాజరవడం గమనించిన ట్రంప్ అతడిని పిలిపించి మాట్లాడారు. ఎందుకు ఫాలో అవుతున్నారు అని స్టేజీ పైకి ఎక్కించి మాట్లాడిస్తే.. మీరు గెలవాలి అని సదరు వ్యక్తి బదులు ఇచ్చారు. దీంతో విశ్లేషకులు ఇంతలో ట్రంప్ లో ఎంత మార్పు వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: