జగన్ కు ఎదురుదెబ్బ.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది. వైసీపీలో కొన్ని రోజులుగా కీలకంగా ఉన్న కిలారి రోశయ్య... జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తాజాగా వైసిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ మేరకు రాజీనామా ప్రకటన.. చేస్తూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు కిలారి రోశయ్య.
 ఈ సందర్భంగా గుంటూరులో  మీడియా సమావేశం నిర్వహించిన.. కిలారి రోశయ్య  కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వైసిపి పార్టీకి నష్టం చేసే వారికి... ఆ పార్టీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ఘాటుగా స్పందించారు కిలారి రోశయ్య. పార్టీ పెద్దలు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే.
 ఇలాంటి పార్టీలో... కొనసాగడం చాలా కష్టంగా ఉందని..  తాను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మీడియా ముందు కూడా విడుదల చేశారు కిలారి రోశయ్య. దీంతో వైసిపి పార్టీకి.. తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. కాగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కిలారి రోశయ్యకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.
 గుంటూరు ఎంపీగా...  2024 ఎన్నికల్లో పోటీ చేశారు కిలారి రోశయ్య. అయితే గుంటూరు ఎంపీ ఎన్నికల్లో చంద్రశేఖర్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు కిలారి రోశయ్య. అయితే... వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోశయ్య.. త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంతో  కిలారి రోశయ్య పనిచేసిన అనుభవం ఉంది. అందుకే జనసేన పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి కిలారి రోశయ్య.. చివరికి ఎలాంటి నియ్రం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: