బడ్జెట్ 24: మొత్తం బడ్జెట్లోనే ఆణిముత్యంలాంటి ప్రకటన?
లోక్సభలో దాదాపు 11 గంటలకు స్టార్ట్ అయిన బడ్జెట్ ప్రసంగం నేటికీ కొనసాగుతోంది. మోదీ సర్కార్ ముచ్చటగా 3వ సారి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం ఇదే. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని కీలక ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే... కొన్ని సెక్టార్లకు భారీ కేటాయింపులు చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. మొత్తం బడ్జెట్లో ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆణిముత్యంలాంటి ఓ ప్రకటన చేయడం జరిగింది. అదే... "రూ.5వేల భృతి." అవును, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షణకు ఎంపికైన ప్రతీ విద్యార్థికీ రూ. నెలవారీ భత్యం రూ. 5,000 ఇవ్వనున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. అయితే దీనికి అందరూ అర్హులేనా అంటే అది కష్టమే అని చెప్పుకోవాలి. ఇలాంటి వాటికి కొన్ని నియమ నిబంధనలు అనేవి తప్పని సరి.
వెనుక బడిన వర్గాల వారికి, ప్రతిభ ఉండి కూడా ఆర్ధికంగా చదువుకోలేని విద్యార్థులకు ఈ పధకం ఎంతగానో సహకరించనుంది. అదే విధంగా పేదవారికి పీఎం ఆవాస్ యోజన - అర్బన్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో.. దాదాపు కోటి కుటుంబాలకు పైగా ఇళ్లు కట్టించనున్నారు. అదేవిధంగా పలు పట్టణాల్లో గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు వడ్డీ రాయితీ పథకం అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.