ఏపీ అసెంబ్లీ: రాష్ట్రం బీహార్ లాగా కాకుండా జగన్ గొంతు ఎత్తగలరా..??

Suma Kallamadi

• త్వరలోనే ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
• ఒంటరి పక్షిగా కనిపిస్తున్న జగన్
• శాంతిభద్రతలపై గళం ఎత్తుతారా
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 45 రోజుల సమయంలోనే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే మాట వాస్తవం. ఏపీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, మారణకాండకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తరచుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే పోలీసులు ఆపకుండా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హత్యలతోపాటు మహిళలపై లైంగిక దాడులు, మహిళల హక్కులు కూడా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు మాజీ సీఎం జగన్ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈసారి సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. వీటిలో క్వశ్చన్ అవర్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ అవర్‌లో భాగంగా ఆర్థిక, మద్యం, శాంతి భద్రతలు వంటి అంశాలపై మాట్లాడతారు. జగన్ ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ సానుభూతిపరులపై, వైసీపీ మద్దతుదారులపై అలాగే వైసీపీ కోసం బాగా పనిచేసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇవన్నీ చూస్తూ సామాన్య జనాలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి బాగా మాట్లాడాల్సిన, దేశవ్యాప్తంగా హైలెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రజల తరఫున శాంతిభద్రతలను నెలకొల్పే లాగా గొంతు ఎత్తగలగాలి.
అసెంబ్లీలో వైసీపీ 11 సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన వాళ్ళు పెద్దగా డేర్ అండ్ డ్యాషింగ్ గా మాట్లాడే వాళ్ళు కాదు. పెద్దిరెడ్డి కూడా అంత దూకుడుగా మాట్లాడలేరు. సో, జగనే వన్ మ్యాన్ ఆర్మీగా మారి ఏపీ బీహార్ గా మారకుండా కాపాడాలి. ఎలాంటి గొడవలు జరగకుండా శాంతిభద్రతలు నెలకొల్పుతూ ప్రజలు ప్రశాంతంగా బతికేలా ఏపీలో పాలన ఉండేలాగా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: