కోట్లల్లో గులాబీ పార్టీ ఆస్తులు..దేశంలోనే నంబర్‌ 1 ?

Veldandi Saikiran
తెలంగాణ తీసుకువచ్చిన గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని.. చెలాయించిన కేసీఆర్... వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నారు. అధికారం కోల్పోవడమే కాకుండా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓల్పోయింది. దీంతో.. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి ఓ విషయం.. భారీ ఊరట కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో... ఆదాయం పరంగా చూసినట్లయితే... గులాబీ పార్టీ టాప్ రేస్ లో ఉంది. ఫుల్ స్పీడ్ తో దూసుకు వెళ్తుంది గులాబీ పార్టీ. 2022 నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయంతో.. కెసిఆర్ పార్టీ టాప్ పొజిషన్లో ఉండటం గమనార్హం.

దాదాపు 737.67 కోట్ల ఆదాయంతో... గులాబీ పార్టీ.. టాప్ గేర్ లో దూసుకు వెళ్తోంది. ఖర్చులో మాత్రం... పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్... మొదటి స్థానంలో ఉంది. దాదాపు గత ఏడాది కాలంలో 181 కోట్ల ఖర్చు చేసి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత.. వైసిపి పార్టీ రెండవ స్థానంలో ఉంది. 79.32 కోట్ల ఖర్చు చేసి... వైసిపి రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక ఖర్చుల విషయంలో 57.47 కోట్లు చేసి ఈ గులాబీ పార్టీ మూడవ స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత 52.62 కోట్లతో డిఎంకె పార్టీ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. సమాజ్వాది పార్టీ 31.41 కోట్లతో.. ఐదవ స్థానంలో ఉంది. అయితే ఈ లెక్కలను..  ఏడిఆర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 57 ప్రాంతీయ పార్టీలలో 39 పార్టీల ఆదాయ అలాగే ఖర్చుల వివరాలను...రిలీజ్ చేసింది.ఈ లెక్కల్లో గులాబీ పార్టీ మొదటి స్థానంలో ఉండగా... మమత బెనర్జీ పార్టీ  33.45 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: