హామీ బ్లాక్ బస్టర్ అమలు యావరేజ్.. బాబు రుణమాఫీ రైతులను మెప్పించలేదా?

Reddy P Rajasekhar
2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక విధంగా రుణమాఫీ కారణమైతే మరో విధంగా పవన్ కళ్యాణ్ కారణమని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో రుణమాఫీ హామీ అమలు జరిగిన తీరు మాత్రం రైతులకు చిరాకు తెప్పించింది. ఐదు విడతల్లో రుణమాఫీని అమలు చేస్తానని చెప్పిన బాబు కేవలం మూడు విడతలు మాత్రమే జమ చేయడం విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
చంద్రబాబు హామీ బ్లాక్ బస్టర్ అమలు మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ అనే కామెంట్లు అప్పట్లో వ్యక్తమయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు 4, 5 విడతల మొత్తం జమ చేస్తామని బాబు ప్రకటించినా ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ మొత్తం జమ కాలేదు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆ రెండు విడతల మొత్తాన్ని ఇప్పుడు జమ చేస్తే బాగుంటుందని కొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు.
 
2024 ఎన్నికల సమయంలో బాబు ఎన్నో హామీలను ప్రకటించినా రుణమాఫీని మాత్రం ప్రకటించలేదు. ఆర్థికంగా భారమైన స్కీమ్ కావడం వల్ల కూడా ఈ స్కీమ్ విషయంలో బాబు వెనుకడుగు వేశారని తెలుస్తోంది. రుణమాఫీ స్కీమ్ ను అమలు చేస్తే ఇతర పథకాలను అమలు చేసే విషయంలో సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
 
తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీని అమలు చేసినా అక్కడి పరిస్థితులు వేరు ఏపీ పరిస్థితులు వేరు అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు రుణమాఫీని ప్రకటించకపోయినా అన్నదాత సుఖీభవ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఐదేళ్లలో 70 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుండగా 30 వేల రూపాయలు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా జమ కానుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ ను వీలైనంత వేగంగా అమలు చేస్తే రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: