గౌరవెల్లి ప్రాజెక్ట్: వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడో.?

Pandrala Sravanthi
-2007లో శంకుస్థాపన.
- 17 ఏళ్ల అయినా పూర్తవ్వలేదు  
- రాజన్న కల నెరవేరేదెప్పుడు, రైతులకు నీరందేప్పుడు.?


 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రాజెక్టులు నిర్మించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి  గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1.43  టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ సమయంలోనే కాస్త కట్ట నిర్మాణం కూడా జరిగింది.  అలాంటి ఈ ప్రాజెక్టును ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2015లో ప్రాజెక్టును సందర్శించి  దీని సామర్ధ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారు. దీంతో ప్రాజెక్టు పనులు మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు  అనే విధంగా సాగుతూ వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు గడిచిన  ప్రాజెక్టుకు మాత్రం ఇప్పటికి మోక్షం దక్కలేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తూనే నిర్మాణం పనులు ఆగిపోతూనే ఉన్నాయి. మెట్ట ప్రాంతమైన ఈ ప్రాంతానికి ప్రాజెక్టు నీరు అందేదెప్పుడు  ప్రజల కల సహకారం అయ్యేది ఎప్పుడు  అర్థం అవడం లేదు.

 కాంగ్రెస్ అయినా పూర్తి చేసేనా.?
 అలనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ప్రాజెక్టును సందర్శించి చిన్న చెరువుల ఉందని చెప్పి  8.23 టీఎంసీలకు పెంచారు. అయినా ఈ ప్రాజెక్టును ఆయన పూర్తి చేయలేకపోయారు.  అలా ఆయన సీఎంగా 9 ఏళ్ల పాలనలో కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. చివరికి 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిచింది.  దీంతో  వారు మొదలుపెట్టిన  ప్రాజెక్టు మళ్ళీ వారి చేతిలోకే వచ్చింది. మరి ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందా? లేదంటే వీళ్ళు కూడా కేసీఆర్ లాగే  ఐదేళ్లు తూతు మంత్రంగా గడుపుతారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.

 ప్రాజెక్టు పూర్తయితే:
 ఈ ప్రాజెక్టు పూర్తయితే  ఉమ్మడి కరీంనగర్, వరంగల్,  మెదక్ జిల్లాల పరిధిలోని చాలా  మంది రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. మొత్తం 1.60 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లేటువంటి కుడికాలువ ద్వారా 90వేల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా 16వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: