టీడీపీ, జనసేనల మధ్య గొడవలు..ఇలా అయితే కష్టమే?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపు 164 స్థానాలతో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే.. ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య గొడవలు జరిగినట్లు.. సాక్షిలో ఓ ప్రత్యేక కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం వైయస్సార్ కడప జిల్లాలో.. ఉన్న గోపవరం లో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పరస్పరం దాడులకు పాల్పడినట్లు... సాక్షిలో వార్త వచ్చింది.
గోపవరం రెవెన్యూ పొలం... 1624 సర్వేనెంబర్  లో కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో మిద్దెల వారి పాలెం, లక్ష్మీ పాలెం అలాగే కోటవీధి ప్రాంతాలకు చెందిన... పేదలతో పాటు బలిజ వర్గానికి సంబంధించిన కొంతమంది గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు... ఆ గుడిసెలను కూల్చేశారు. మరికొన్ని గుడిసెలకు మంట పెట్టి.. కాల్చేశారు. ఇక ఈ సమాచారం అందుకున్న జనసేన నాయకులు అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అటు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అక్కడికి రావడంతో...  మధ్య తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకుల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.
 ఈ సందర్భంగా జనసేన అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో కొట్టుకున్నారట. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారిన నేపథ్యంలో... పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితి చక్కదిద్దారట. అలాగే ఇరు వర్గాలపై కేసులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... ఈ వార్తను సాక్షి పేపర్ చాలా హైలెట్ గా... చేసి చూపించింది. మిత్రపక్షాలు...  ఇప్పుడు శత్రువులుగా మారాయని సంకేతం ఏపీ ప్రజల్లోకి వెళ్లే... సాక్షిగా చేసిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఈ వివాదాన్ని జనసేన, టీడీపీ అధిష్టానాలు లైట్‌ తీసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: