అమెరికాలో రిపబ్లిక్ అని పార్టీ తరఫున ఉపాధ్యక్షులు అభ్యర్థిగా జెడి వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత సంతతికి చెందిన న్యాయవాది ఆయాన సతీమణి ఉష వార్తల్లో నిలిచారు. నవంబర్ 5వ తేదీన జరిగే అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ట్రంప్ మరియు వాన్స్ గెలిస్తే తొలి ఇండో అమెరికన్ ద్వితీయ మహిళగా ఉష రికార్డుల్లోకి ఎక్కుతుంది. అయితే వాన్స్ సతీమణి ఉషా చిలుకూరుకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులు ఏపీ నుంచి అమెరికాలోకి వెళ్లి స్థిరపడ్డారు. అయితే 90 ఏళ్ల వయసులో కూడా పాఠాలు చెబుతూ పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు, ఉష మనవరాలు వరుసవుతారట.
శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగు ప్రొఫెసర్ గా పని చేశారు, కొన్ని సంవత్సరాల క్రిందట మరణించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఉష. ఉషా చిలుకూరి కృష్ణాజిల్లాకు ఆడపడుచు అవుతారు. ఆమె యొక్క మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఎక్కువగా ఉన్నాయి. ఉషాకు తాత వలస అయ్యే చిలుకూరి రామ్మోహన్రావు కుటుంబం ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని నివాసం ఉంటుంది.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఉషా యొక్క పూర్వీకులు ఈ జిల్లా నుంచి దశాబ్దాల క్రితమే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చి పాపయ్య శాస్త్రి నివసించేవారని ఆయన సంతానమే విస్తరించిందని తెలియజేశారు. అయితే ఉష మన దేశంలో నివసించి ఉండి, ఈ స్థాయికి వెళ్తే మనం మరింత గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేదని శాంతమ్మ అన్నారు. వాన్స్ తప్పనిసరిగా విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గెలిచిన తర్వాత తప్పకుండా విశాఖకు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ విధంగా వాన్స్ భార్య ఉష ఏపీ మూలాలు ఉన్న అమ్మాయి అని తెలియడంతో వాన్స్ గెలవాలని తెలుగు ప్రజలంతా కోరుకుంటున్నారు.