ఏపీ:మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్లు సైతం ఎన్నో పనులను స్వయంగా దగ్గరుండి చేయిస్తూ ఉన్నారు. పెనుగొండ నుంచి టిడిపి పార్టీ నుంచి సవితమ్మ  పోటీ చేసి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సవితమ్మకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది. కేవలం మంత్రి పదవి రావడంతో సైలెంట్ గా ఉండకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సవితమ్మ.. ముఖ్యంగా ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని.. తాము చెప్పిన హామీలను కూడా నెరవేర్చే విధంగానే అడుగులు వేస్తూ ఉన్నామంటూ ప్రజలలో మమేకమవుతూ ముందుకు వెళుతున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఫ్లైఓవర్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనలో మార్గమధ్యంలో వెళుతున్న మంత్రి సవితమ్మ గుర్తించి.. తన కాన్వాయ్ ని ఆపి మరి సహాయక చర్యలను పంపించి దగ్గరుండి అక్కడ ఘటనను పరిశీలించింది.. ముఖ్యంగా ఆటోను కారు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.

ఆ క్షతగ్రాతులకు మంచినీరు అందించడమే కాకుండా దగ్గరుండి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి.. తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించినట్లు సమాచారం..అలాగే తన వెంట ఉన్న వారిని కాయాలైన వారితో పాటుగా ఆసుపత్రి వరకు పంపించినట్లు తెలుస్తోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా అక్కడ ఉండే అధికారులతో మాట్లాడి మరి పంపించినట్లు తెలుస్తోంది. సవితమ్మ మంచి మనసుకి సైతం చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు  మరి కొంతమంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తూ మీలాంటివారు నాయకులు అయితే  ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుంది అంటూ తెలియజేస్తున్నారు. చాలామంది నాయకుల సైతం మార్గం మధ్యలో తమకు ఎదురయ్యే ఇలాంటి వాటిని గుర్తించి చేయగలిగితే మరింత పేరు వస్తుందని కూడా చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: