ఏపీ: పశు పోషకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పశుపోషకులకు ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది.. ఏపీ పశువర్ధన శాఖ మంత్రి కింజ రావు ఆచ్చేన్నాయుడు పలు విషయాలను తెలియజేశారు.. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం గ్రామీణ పేదల జీవనోపాధిని సైతం మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఆచ్చేన్నాయుడు తెలియజేశారు.. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా 90% వరకు పశువుల షెడ్లకు రాయితీ ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.

అలాగే గొర్రెలు ,,మేకలు, కోళ్ల షెడ్లు నిర్మాణానికి సైతం రాయితీ కల్పించబోతున్నామని రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ కూడా వీటిని అమలు చేసేలా చూస్తామంటూ మంత్రి ఆచ్చేన్నాయుడు తెలియజేయడం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పశుపోషకులకు 90% పైగా రాయితీ ఇస్తామని ఒక్కో షెడ్డు కు గరిష్టంగా 2.30 లక్షల వరకు ఇస్తామని గొర్రెలు మేకలు షెడ్లు ఉన్నవారికి 70% రాయితీ ఉంటుంది అంటూ గరిష్టంగా యూనిట్ కి 2.30 లక్షలు ఇవ్వబోతున్నట్లు ఆచ్చేన్నాయుడు తెలియజేశారు.

అలాగే కోళ్ల పెంపకం ద్వారా ఒక్కో షెడ్ కి 70% రాయితీ ఇవ్వబోతున్నామని..1.32 లక్షల వరకు ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.ఇవి అన్ని జిల్లాలలో ఈ పథకం అమలు కాబోతుందని క్లారిటీ ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలోనే  ఇవి నిర్మించబడతాయని కూడా తెలియజేశారు. గ్రామాలలో పశుపోషకన పెంపకం ఎక్కువగా ఉండాలని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఆచ్చేన్నాయుడు తెలియజేశారు. అయితే గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వమే ఇప్పుడు ఇలాంటివన్నీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందంటూ ఆచ్చేన్నాయుడు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఏపీని మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోయేలా సన్నాహాలు చేస్తున్నామని కూడా తెలియజేశారు. ఎవరు కూడా ఎలాంటి కల్పిత వార్తలను సైతం నమ్మవద్దు అంటూ తెలిపారు. మరి రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: