కేసీఆర్ కు మళ్ళీ ఊపిరి పోస్తున్న హిమాన్షు ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో... అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు... గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ కాండవ కప్పుకున్నారు. ఇవాళ అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ను కలిసిన ప్రకాష్ గౌడ్ నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చంద్రబాబు నాయుడు ను కలిసిన... అరికెపూడి గాంధీ కూడా... ఇప్పుడు.. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.  మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా... కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా డీల పడిపోయారు. పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన.. కేసీఆర్ ను... ఇలా ఎమ్మెల్యేలు వదిలి వెళ్ళడం... అందరికీ బాధ కలిగిస్తోంది.
 అయితే ఇంతటి సంక్షోభంలో... కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు... ఆయన మనవడు  కల్వకుంట్ల హిమాన్షు..  కాస్త రిలీఫ్ అందించారు. తాజాగా కేటీఆర్ కొడుకు హిమాన్షు బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ ఫామ్ హౌస్ లో... ఈ బర్త్డే వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు.  ఎమ్మెల్యేలు జారిపోతున్న నేపథ్యంలో... ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు కేసీఆర్ కూడా చాలా హ్యాపీగా... హిమాన్షు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
 గతంలో ఎప్పుడూ కూడా హిమాన్షు బర్త్ డే వేడుకల్లో కేసీఆర్... ఇంత హ్యాపీగా పాల్గొనలేదు. కానీ తాను హ్యాపీగా ఉన్నానని... పరోక్షంగా చెప్పేందుకు... కెసిఆర్ ఇలా చేసి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా 19 కిలోల  కేకును... హిమాన్షు కట్ చేసి... తన తాత కెసిఆర్ కు పెట్టారు. ఈ సందర్భంగా హిమాన్షుకు... కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఇక హిమాన్షు బర్త్ డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: