ఏపీ: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైయస్ షర్మిల.. ఎందుకంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది .విజయవాడలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కేవలం నెల రోజులు అయ్యిందని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు కల్పిస్తామని చెప్పిన ఎందుకు వాటిని నిలబెట్టుకోలేదంటూ కూడా ప్రశ్నించింది. ఇటువంటి పథకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండవ రోజు అమలు చేసిందంటూ కూడా తెలియజేశారు. అలాగే కర్ణాటకలో మూడో వారంలోనే ఈ పథకాన్ని అమలు చేశారంటూ వెల్లడించారు.

బస్సులో ప్రయాణం అంటే మహిళలకు రక్షణగా ఉంటుందని ఇది మహిళలకు ఉపయోగపడే పథకం అని కూడా తెలిపింది.. సూపర్ సిక్స్ హామీలు ప్రకటించి అన్ని పథకాలను అమలు చేయాలని కూడా ఆమె తెలియజేసింది. అలాగే తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు కేవలం తల్లికి మాత్రమే 15000 అంటూ జీవో ఇచ్చారు అంటు ఫైర్ అయ్యింది.. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ల పైన కూడా టిడిపి నేతలు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారని.. వైజాగ్ ప్రాంతానికి స్టీల్ క్యాప్టివ్ గా మైన్ ఉండాలంటూ తెలియజేసింది.

మోడీ అంటేనే మోసం వెన్నుపోటు అని అలాగే జగన్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పట్టించుకోలేదని తెలియజేసింది. దీనిపైన చంద్రబాబు మాత్రమే మాట్లాడాలని కూడా తెలియజేసింది షర్మిల రాజశేఖర్ రెడ్డి వైసీపీ మనిషి కాదని ఆ పార్టీ అసలు వైఎస్ఆర్సిపి పార్టీ కాదని వైసీపీలో రాజశేఖర్ రెడ్డి లేరని తెలిపిందిషర్మిల. వైయస్సార్ ఆశయాలను నిలబెట్టే వారు ఎవరూ కూడా వాటిని విమర్శించరు అంటూ కూడా ప్రశ్నించింది వైఎస్ షర్మిల. ప్రస్తుతం షర్మిల చేసినటువంటి ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. 2024 ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పునరుద్దించడానికి తన సాయి శక్తుల ప్రయత్నిస్తూనే ఉంది షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: