కూటమి పాలన @ 30 : సూపర్ జోష్లో బీజేపీ మినిస్టర్ పనితీరు..?

Pulgam Srinivas
2024 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఇక దానిలో తెలుగు దేశం పార్టీ కి అత్యధిక అసెంబ్లీ స్థానాలు రాగా ... ఆ తర్వాత జనసేన ఆ తర్వాత బీజేపీ కి స్థానాలు వచ్చాయి. ఇకపోతే బీజేపీ నుండి 11 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా అందులో 8 మంది గెలిచారు.

అలా గెలిచిన 8 మందిలో సత్య కుమార్ యాదవ్ ఒకరు. ఈయన 1993 లో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరారు మరియు ప్రైవేట్ సెక్రటరీగా , అదనపు ప్రైవేట్ సెక్రటరీగా ,  సీనియర్ ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు OSD గా కూడా సత్య కుమార్ యాదవ్ పని చేశారు. 2021 లో ఈయన మళ్ళీ రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వచ్చారు. అందులో భాగంగా బీజేపీ లో చేరి 2018 వ సంవత్సరంలో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.

కేరళ , కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకుడిగా కూడా సత్య కుమార్ యాదవ్ పని చేశారు. 2024 లో ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 3734 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మరియు 12 జూలై 2024 న నాల్గవ ఎన్. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు చంద్రబాబు మంత్రివర్గంలో వైద్య , విద్య మరియు ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం మంత్రి పదవులు దక్కాయి.

ఇకపోతే ఈయన మొదటి నుండి కూడా తనకు అప్పజెప్పిన మంత్రి పదవులను జనాల బాబు కోసం ఉపయోగిస్తారు అని చెబుతూ వచ్చాడు. ఇకపోతే ఈయన మంత్రిగా బాధ్యతలను చేపట్టి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజులలో ఈయన తనకు అప్పగించిన మంత్రి పదవుల బాధ్యతలను బాగానే నిర్వర్తించాడు. ఇక రాబోయే రోజుల్లో ఈయన తన మంత్రి బాధ్యతలను మరింత మెరుగ్గా వినియోగిస్తాడు అని చాలామంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: