RRR ఏది మర్చిపోలేదు.. టైమ్ చూసి కొడుతున్నాడుగా?

praveen
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అనూహ్య ఫలితాలు వచ్చాయ్. అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తే.. జనసేన బిజెపి టిడిపి టిడిపి కూటమి మాత్రం 174 స్థానలలో విజయం సాధించగలిగింది. ఈ క్రమంలోనే జగన్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఇక వైసిపి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు కూటమి పార్టీలలోకి జంప్ అవుతారు అనే చర్చ ఆంధ్ర రాజకీయాల్లో తీవ్రంగా నడుస్తుంది. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేసిన జగన్ పై ఇక ఇప్పుడు కూటమి పార్టీల నేతలు రివేంజ్ తీర్చుకుంటారా అనే విషయం కూడా ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలోనే ఇక ఇప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు కావడం సంచలనగా మారిపోయింది. అది కూడా ఈ కేసు పెట్టింది ఎవరో కాదు గతంలో జగన్  తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అప్పటి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కావడం గమనార్హం  జగన్ ప్రభుత్వ వైఫల్యాలను అక్రమాలను టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణరాజు అప్పట్లో చేసిన విమర్శలు ఎంత సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అప్పట్లో పోలీసులు రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశారు  అంతేకాదు పోలీసులు తనను చంపాలని చూసారని తీవ్రంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించారు.

 అయితే ఒకప్పుడు ఇలా జగన్ తనను ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మనసులో పెట్టుకున్న రఘురామకృష్ణ రాజు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అంతేకాదు విజయం అందుకున్నారు. అయితే ఇక ఇప్పుడు జగన్ చేసినవన్నీ మనసులో పెట్టుకుని రఘురామా టైం చూసి కొడుతున్నాడు  ఇప్పటికే జగన్ కు అసెంబ్లీలో బలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారతారో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో రఘు రామ రివెంజ్ కు రెడీ అయ్యాడు. ఇక ఇటీవల ఏకంగా మాజీ సీఎం జగన్ పై కేసు పెట్టారు. కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఇక జగన్ పై కేసు నమోదు అయింది. రఘురామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పిఎస్ లో కేసు నమోదు అయింది. గతంలో తన అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని రఘురామ  ఆరోపించారు. కస్టడీలో ఉన్నప్పుడు తనను దారుణంగా హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ చాతిపై కూర్చొని చంపడానికి ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా జగన్ పై రఘురామ కేసు పెట్టిన విషయం తెలిసి టైం చూసి రఘురామ జగన్ను దెబ్బ కొడుతున్నాడని.. గతంలో జగన్ చేసిన ఏ పనిని మర్చిపోలేదు అంటూ నేటిజన్స్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: