లక్ష్మీపార్వతి ఏయూ ప్రొఫెసరా? అబద్ధాలకు కూడా హద్దులుండాలి!

Suma Kallamadi
'పవిత్రమైన ఏయూ (ఆంధ్రా యూనివర్సిటీ) వైసీపీ కార్యాలయంగా మార్చేసుకున్నారు!' అని మాజీ వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అయితే కూటమి ప్రభుత్వం ఎగదోయడంతో ప్రసాద్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు ఇంకా నిరూపింపబడలేదు సరికదా వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ర్టార్ స్టీఫెన్ లు చేసిన అక్రమాలు విచిత్రంగా విద్యార్థుల ద్వారా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఓ వర్గంవారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని వీసీ ప్రసాదరెడ్డి ఏకంగా ఏయూ తెలుగు ప్రొఫెసర్‌ అని చెప్పారు. అంతవరకూ బాగానే ఉందిగానీ ఆమెని ఎవ్వరికీ తెలియకుండా నియమించేశారా?
లక్ష్మీపార్వతి బేసిగ్గా విజయవాడలో ఉంటారు. పీహెచ్‌డీ చేసిన పరిశోధకులంతా దాదాపు విశాఖకి చెందినవారే. ఆమె అక్కడ ఉండే ఇక్కడి వారిని ఎలా గైడ్ చేస్తారనే విషయం కూడా ఆలోచించలేదా? ఇకపోతే పీహెచ్‌డీ చేసే పరిశోధకులకు గైడ్ వ్యవహరించే ప్రొఫెసర్ అనేవారు నిబంధనల మేరకు పీజీ విద్యార్థులకు ఆల్రెడీ పాఠాలు బోధించి ఉండాలి. అదేవిధంగా కనీసం 5 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. ఇవేమీ లేకుండానే లక్ష్మీపార్వతిని గైడ్ గా నియమించేశారు అన్న ఆయన మాటలు ఎంతవరకు వాస్తవమో ఆ పరమేషుడికే ఎరుక? ఈ నేపథ్యంలోనే ఆమె విశాఖపట్నం వచ్చేదెప్పుడు?, మేము ఆమె సలహాలు తీసుకొనేదెప్పుడు? అంటూ పరిశోధనా విద్యార్థులు వాపోతున్నారు.
ఈ క్రమంలో 'మీకు ఎలాంటి భయాలు అవసరం లేదు. మేం చూసుకుంటాం!' అని డీన్ కమ్ రిజిస్ర్టార్ జేమ్స్ స్టీఫెన్ భరోసా ఇవ్వడం కొసమెరుపు. సాధారణంగా ఇలాంటి రీసెర్చి చేసేవారు సంబంధిత విభాగంతో అనుసంధానమై ఉండాలి. కానీ, టీడీఆర్ హబ్ డీన్‌గా వ్యవహరిస్తున్న జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తి ఈ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో పని చేస్తున్న వారిని తీసుకువచ్చి ప్రొఫెసర్లుగా నియమించి.. 'గైడ్లు' అని ప్రచారం చేసి వారికి పరిశోధకులను అప్పగించారు. ఇలాంటి వారివలన భావితరాలకు ఏం ఒరుగుతుంది? ఇంతటి దారుణమైన విద్య విధానానికి కారకులు ఎవరు? అనే కోణంలో ఇపుడు చర్చలు జరగాలి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దయచేసి కళాశాలల్లోగానీ, విశ్వవిద్యాలల్లోగానీ నాయకులు దూరి తమ పైత్యాలను రుద్దవద్దని, వారి జీవితాలతో ఆడుకోవద్దనీ చెబుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: