చంద్రన్న పాలన: అక్రమ రేషన్ పై ఉక్కుపాదం..రైతుబజార్లలో కందిపప్పు ?

Veldandi Saikiran

* అక్రమ రేషన్‌పై నాదెండ్ల ఫోకస్‌
* రైతుబజార్లలో బియ్యం, కందిపప్పు
* అవినీతి అధికారులు, నేతలకు చెక్‌


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.... జనసేన కీలక నేత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్... రేషన్ బియ్యం పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... తన డ్యూటీ ఎక్కిన నాదెండ్ల మనోహర్.. గతంలో పనిచేసిన అనుభవంతో ముందుకు వెళుతున్నారు. ఏపీలో.. ప్రజలకు రేషన్ బియ్యం, కందిపప్పు ఇతర నిత్యవసరాలు సరైన సమయంలో వచ్చేలా... చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా... తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఇబ్బందులు లేకుండా... బియ్యం పంపిణీ చేస్తున్నారు.

ప్రజలకు రేషన్ బియ్యం అందించడమే కాకుండా... పౌరసరఫరాల శాఖలో ఉన్న అధికారులను... ఓ ఆట  ఆడుకుంటున్నారు.  వైసిపి పాలనలో... జరిగిన అవినీతిని కూడా నాదెండ్ల మనోహర్ బయట  పెడుతున్నారు. వైసీపీ పాలనలో... చాలావరకు రేషన్ బియ్యం  అక్రమంగా తరలించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా... ఇదే విషయంపై నాదెండ్ల మనోహర్ ఫోకస్ చేశారు.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ పోర్టుల ద్వారా  కోట్ల విలువ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లు... గుర్తించారు నాదెండ్ల మనోహర్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో చేసిన అక్రమాలను బయటకు తీసి... ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అదే సమయంలో జనసేన నేతలను గతంలో వణికించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని.... ప్రభుత్వం లో ఉండి... వాటా ఆడుకుంటున్నారు నాదెండ్ల.

ఇక లేటెస్ట్ గా..రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న ఐపీఎస్ అధికారుల వివరాలు నా దగ్గర ఉన్నాయన్నారు నాదెండ్ల మనోహర్. కేబినెట్ లో చర్చించి ఆ ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని తాజాగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక గురువారం రోజున హోల్ సేల్ ధరలకే... రేషన్ బియ్యం అలాగే కందిపప్పు  ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండేలా   రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. కిలో కందిపప్పు 160 రూపాయలకు అందుబాటులో ఉండేలా ఆ చర్యలు తీసుకున్నారు. అటు అక్రమంగా  రేషన్ బియ్యం తరలిపోకుండా కూడా స్ట్రిక్ట్ గా పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: