ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి.. ఏపీకే తలమానికమవుతుందా.?

Pandrala Sravanthi
- శరవేగంగా రాజధాని పనులు..
 -ఇక అమరావతికి అడ్డు లేదు..
-బాబు నెల పాలనలోనే అడ్డంకులన్నీ క్లియర్..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడిచింది. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు తన అద్భుతమైనటువంటి మార్క్ పాలన చూపించాడు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కొన్ని పనులను చేసుకువచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమరావతి..ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఒక అడుగు ముందుకు పడింది. దీని వెనక చంద్రబాబు కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. అమరావతి అభివృద్ధికి సంబంధించి 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ కొంత అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చింది. దీంతో ఈ పనులన్నీ అటకెక్కాయి. జగన్ ఐదు సంవత్సరాల పాలన తర్వాత మళ్లీ 2024 ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ఓఆర్ఆర్ కి కేంద్రం ఆమోదం తెలియజేసింది. ఈ విధంగా నెల రోజుల్లోనే అద్భుతమైన మార్క్ పాలన దిశగా దూసుకెళుతున్నట్టు చంద్రబాబు అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనే వివరాలు చూద్దాం..

 చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలి ఢిల్లీ పర్యటనతోనే రాష్ట్రానికి ఎంతో మేలు చేసే పనులు చేసుకువచ్చారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గట్కారి  తో చర్చించి, రాజధాని అమరావతిని అనుసంధానపరుస్తూ  రహదారులను ఏర్పాటు చేయడం కోసం ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. దీనికోసం 20 నుంచి 25 వేల కోట్లు పూర్తిగా కేంద్రం భరిస్తుందని కూడా ఆమోదం తెలియజేశారు. మొత్తం ఇందులో గ్రీన్ ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే ఉంటాయట.. ఈ ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ అయితే  అమరావతికి మిగతా ప్రాంతాల నుంచి చాలా సులువుగా  రాకపోకలు పెరిగిపోతాయి. అమరావతి,హైదరాబాద్ మధ్య ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే మరియు శ్రీ సత్య సాయి జిల్లాలోని కోడికొండ నుంచి మెదరమెట్ల వరకు ఎక్స్ప్రెస్ వే ని గ్రీన్ ఫీల్డ్ హైవే గా మార్చబోతున్నారు.


ఓ ఆర్ ఆర్ సహా  రహదారుల నిర్మాణం మొదలైతే మాత్రం రెండు నుంచి మూడు ఏళ్లలోపే  రాజధాని అమరావతి లో సమూల మార్పులు వచ్చి అభివృద్ధిలో దూసుకుపోతుంది. కేవలం అమరావతి రాజధాని మారడమే కాకుండా ఈ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక కార్యకలాపాలు, మౌలిక వసతులు, కంపెనీలు ఇలా అనేకం ఆంధ్ర ప్రదేశ్ కి వస్తాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల లక్షలాది సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడి నిరుద్యోగం అనేది ఉండదు. ఈ విధంగా చంద్రబాబు వచ్చినటువంటి నెలరోజుల కాలంలోనే ఇంతటి అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి  ఆలోచన చేశారంటే ఈ ఐదేళ్లలో ఆయన ఏపీని ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: