ఏపీ: వైసీపీ నేతలకు ఊరటనిచ్చిన హైకోర్టు.. ఏం జరిగిందంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలకు తాజాగా ఉరట లభించిందని తెలుస్తోంది. టిడిపి కార్యాలయం పైన దాడి కేసులో వైసీపీ నేతలకు సైతం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని తెలియజేసింది.. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం పైన 2021లో అక్టోబర్ 19న దాడి జరిగినట్లుగా తెలిపారు.. అందుకు సంబంధించి కేసు కూడా ఫైల్ కావడంతో నిందితులను టిడిపి కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు సంబంధించిన కేసును సైతం బయటికి వెలికి తీశారు. ముఖ్యంగా అలాంటి విధ్వంశానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాలు ద్వారా గుర్తించారని పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఐదు మంది వైసీపీ కార్యకర్తలను సైతం  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము అంటూ తెలిపారు. టిడిపి కార్యాలయం దాడి కేసులో మొత్తం మీద 56 మంది నిందితులు ఉన్నట్లుగా గుర్తించారట. ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, కార్పొరేటర్లు అరవ సత్యం తో సహా మరి కొంతమంది ఉన్నట్లుగా గుర్తించారట. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో ముందస్తు బెయిల్ కు దాఖలు చేసుకున్నట్టుగా కొంతమంది వైసీపీ నేతలు తెలుస్తోంది.

అప్పిరెడ్డి, తలసీల రఘురామ్, ఆర్కే సజ్జల రామకృష్ణారెడ్డి, అభినాష్ ముందస్తు బెయిలు సైతం  మంజూరు చేసినట్లుగా తెలుస్తున్నది.. సీఎం చంద్రబాబు నివాసం పైన దాడి కేసులో కూడా జోగి రమేష్ కు ముందస్తు వేలు ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణ జూలై 16వ తేదీకి వాయిదా వేయబోతున్నారు.. అంతవరకు ఆయనను అరెస్టు చేయవద్దు అంటూ కూడా కోర్టు హెచ్చరించింది. వైసిపి హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది అంటూ కొంతమంది టీడీపీ నాయకులు పిటిషన్ వేశారు. ఇప్పటివరకు ఆ పిటిషన్ విచారణలో కొంతమంది వైసిపి నేతలకు ఊరట లభించినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: