ఏపీ: జగన్ ఎమ్మెల్యే నుంచి ఎంపీ పోటీపై.. క్లారిటీ ఇదే..?

Divya
2019లో జగన్ సీఎం అయిదేళ్లపాటు పని చేశారు. మళ్లీ సీఎం కావడానికి 2024లో ప్రయత్నించిన ఓడిపోయారు.. కానీ దీంతో ఢిల్లీ రాజకీయాల వైపు జగన్ అడుగులు వేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే మొదట ఈ న్యూస్ చిన్నదిగా వచ్చిన ఆ తర్వాత పెద్ద వైరల్ గా మారిపోయింది.. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ న్యూస్ ఎక్కడ కూడా నమ్మేలా కనిపించడం లేదు.జగన్ ఏపీలో ఉండాలి అసెంబ్లీలో ఉండాలి ప్రతిపక్ష నేతగా ఉండాలని కేవలం టిడిపి కూటమినే బలంగా టార్గెట్ చేయాలని ఉద్దేశంతోనే ఉన్నారట.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.. ఎంపీగా ఒకవేళ నిలబడిన కూడా పార్లమెంటులో కూటమిలో భాగస్వామి కాదు కాబట్టి గెలిచినా కూడా మంత్రి పదవులు కూడా ఇవ్వరు. అయినా  నలుగురు ఎంపీలతో ఢిల్లీలో కూర్చోవాలని అది కూడా మొత్తం పార్లమెంటులో 41 పార్టీలు ఉన్నప్పటికీ వారికి ఉన్న సంఖ్య బలం ప్రకారం జగన్ పార్టీకి 15వ స్థానంలో ఉన్నది.. ఇలాంటి చర్చ జరిగిన కూడా ఈ విధంగా చివరిగా చాన్స్ లభిస్తుందని చెప్పవచ్చు. అలా వివక్ష ఎంపీగా 543 మందిలో ఒకరుగా జగన్ కూర్చుంటే లాభం ఉండదని కూడా వైసీపీలో చర్చ నడుస్తోంది.

అయితే ఇదంతా కేవలం కావాలని కూటమి నేతలు సృష్టించాలనే విధంగా కనిపిస్తోంది. ఎంతలా అంటే తెలంగాణకు  సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి కడప ఎంపీ సీటు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పడంతో కూడా అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సీఎం నోటి నుంచి ఇలాంటి వార్త రావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీటికి తగ్గట్టుగా టిడిపి మీడియా కూడా ఈ న్యూస్ను తెగ వైరల్ గా చేసింది. ప్రస్తుతం టిడిపి అమలు చేస్తున్న పథకాల గురించి అడగకుండా ఉండేందుకు ఇలా డైవర్ట్ చేయడానికి చేశారన్నది ఇప్పుడు లాజిక్కుగా మారింది.. సీఎంగా చేసిన వ్యక్తి ఎంపీగా ఎందుకు వెళ్తారని అది కూడా పులివెందల సీటుకు జగన్ ఎందుకు రాజీనామా చేస్తారన్నది ఇక్కడ ఆలోచించాలి. అయితే అదంతా కేవలం వట్టి మాటలే అన్నట్లుగా వైసిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: