31 జనవరి 2026 మెగాఫ్యామిలీ చరిత్రలోనే గుర్తుండిపోయే రోజు కాబోతుందా..?

Thota Jaya Madhuri
 మెగా అభిమానులకు ఈ ఏడాది జనవరి 31 ఒక సాధారణ తేదీ కాదు. ఆ రోజు మెగాఫ్యామిలీ చరిత్రలోనే కాదు, మెగా ఫ్యాన్స్ హృదయాల్లో కూడా శాశ్వతంగా నిలిచిపోయే రోజుగా మారబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ తేదీని “మెగా డే”గా పిలుస్తూ అభిమానులు భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం ప్రకారం, ఆ రోజు ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం ఖాయమని అంటున్నారు.ఇంతకీ ఈ సంబరాల వెనుక అసలు కారణం ఏమిటంటే… రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త. గత కొన్ని రోజులుగా ఈ జంటకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియా, ఫ్యాన్ వర్గాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జనవరి 31న ఉపాసన ఇద్దరు శిశువులకు జన్మనివ్వబోతున్నారన్న ప్రచారం మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠను పెంచింది.

ఉపాసన గత ఏడాది దీపావళి పండుగ రోజున కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంప్రదాయబద్ధంగా సీమంతం జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచే మరోసారి గుడ్ న్యూస్ రాబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ దంపతులు తమ ముద్దుల కూతురు క్లిన్ కారాకు జన్మనిచ్చిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు. ఆ ఆనందం ఇంకా తగ్గకముందే, ఇప్పుడు మరో ఇద్దరు వారసులు రాబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో డబుల్ ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈసారి పుట్టబోయేది కొడుకులా? కూతుర్లా? లేక ఒక కొడుకు – ఒక కూతురా? అన్నది ఇప్పటికీ సస్పెన్సుగానే ఉంది. అయితే ఇప్పటికే రామ్ చరణ్‌కు కూతురు ఉండటంతో, ఈసారి కొడుకులు పుడితే బాగుంటుందని మెగా అభిమానులే కాదు, కుటుంబ పెద్దలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి – సురేఖ దంపతులు మరోసారి మనవళ్లను చూడాలని ఆశపడుతున్నారన్న మాట అభిమానుల్లో మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది.

ఇదే విషయానికి బలం చేకూర్చేలా రామ్ చరణ్ గతంలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు మరోసారి గుర్తుకు వస్తోంది. ఆ షోలో రామ్ చరణ్‌కు సురేఖ దేవి, అంజనమ్మ ఇద్దరూ కలిసి ఒక స్పెషల్ వీడియో బైట్ పంపిస్తారు. ఆ వీడియోలో ఎంతో ప్రేమగా, సరదాగా “మాకు ఒక వారసుడు కావాలి” అంటూ రామ్ చరణ్‌ను కోరుతారు.ఆ వీడియోకు రామ్ చరణ్ ఇచ్చిన స్పందన అప్పట్లో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. చిరునవ్వుతో, కొంచెం షైగా, కానీ ఆనందంతో “ఓకే” అని చెప్పడం ఆ క్షణాన్ని మరింత క్యూట్‌గా మార్చింది. ఆ సీన్ చూసిన చాలా మంది అభిమానులు, ఇది కేవలం సరదా మాటలే అయినా భవిష్యత్తులో నిజమైతే ఎంత బాగుంటుందో అని అప్పుడే కామెంట్లు చేశారు.

ఇప్పుడు అదే వీడియో, అదే మాటలు, ఈ తాజా వార్తల నేపథ్యంలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.ఏది ఏమైనా, జనవరి 31 మాత్రం మెగా అభిమానులకు భావోద్వేగాలు, ఆనందం, ఉత్సాహంతో నిండిన రోజుగా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ రోజు ఏం జరగబోతోందో… మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: